https://oktelugu.com/

KCR Chanakya strategy: కేసీఆర్ చాణక్య వ్యూహం.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు నయా ప్లాన్..

KCR Chanakya strategy: ప్రత్యర్థులను ఇరుకున పెట్టి దాడి చేయడం రాజకీయ పార్టీల ప్రధాన లక్షణం అని చెప్పొచ్చు. ఏదేని పొలిటకల్ పార్టీ ప్రజల్లో ఉండాలంటే ఇందుకుగాను వ్యూహాలను రచించుకుంటుంది. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకుగాను తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నయా ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఈ మేరకు పార్టీ వర్గాలను, నేతలను అప్రమత్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ కేసీఆర్ వేసిన నయా […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 22, 2021 / 02:44 PM IST
    Follow us on

    KCR Chanakya strategy: ప్రత్యర్థులను ఇరుకున పెట్టి దాడి చేయడం రాజకీయ పార్టీల ప్రధాన లక్షణం అని చెప్పొచ్చు. ఏదేని పొలిటకల్ పార్టీ ప్రజల్లో ఉండాలంటే ఇందుకుగాను వ్యూహాలను రచించుకుంటుంది. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకుగాను తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నయా ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఈ మేరకు పార్టీ వర్గాలను, నేతలను అప్రమత్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ కేసీఆర్ వేసిన నయా ప్లాన్ ఏంటంటే..

    KCR Chanakya strategy

    వానాకాలంతో పాటు యాసంగి వడ్ల కొనుగోలు విషయమై గత కొంత కాలంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతలు తమదే ముందు అడుగు ఉండాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్రాన్నితప్పుబడుతూ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. అలా ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్స్‌ను కేంద్రం ఒప్పుకున్నట్లయితే, అది తమ విజయంగా తెలంగాణలో ప్రచారం చేయొచ్చని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే తెలంగాణలో బీజేపీని మరింత టార్గెట్ చేయొచ్చనే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

    మొత్తంగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ పక్కాప్రణాళిక ప్రకారమే ముందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కేంద్రం మాత్రం మొదటి నుంచి ఒకటే వైఖరితో ఉన్నట్లు స్పష్టమవుతోంది. యాసంగి కొనుగోలు విషయం గురించి ఇప్పుడు చెప్పలేమని, అయితే, వానాకాలం టార్గెట్‌ను తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇంకా పూర్తి చేయలేదని అంటోంది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు.

    Also Read: TRS vs BJP: ఆత్మగౌరవ నినాదం: కేంద్రం టార్గెట్.. మళ్లీ సెంటిమెంట్ రగిలిస్తున్న టీఆర్ఎస్

    వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేయడంతో పాటు చివరకు సమావేశాలను కూడా బహిష్కరించారు. అలా సీఎం కేసీఆర్ వ్యూహం ప్రకారమే.. ఓ వైపు రాష్ట్రస్థాయిలో టీఆర్ఎస్ శ్రేణులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. మరో వైపున దేశ రాజధానిలో టీఆర్ఎస్ మంత్రులు, నేతలు కేంద్రమంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా బీజేపీని ఇరుకున బెట్టే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. తాము గతంలో చెప్పిన విషయాలకు కట్టుబడి ఉన్నామని, యాసంగి కొనుగోలుకు సంబంధించిన టార్గెట్ అప్పుడే చెప్తామని, యాసంగి ధాన్యం టార్గెట్ పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే, ధాన్యం కొనుగోలు విషయమై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని, అప్పటి వరకు తాము ఢిల్లీ వదలి వెళ్లబోమని టీఆర్ఎస్ మంత్రులు అనౌన్స్ చేశారు. చూడాలి మరి.. చివరికిఏం జరుగుతుందో ..

    Also Read: Kodurupaka Village: సాయంత్రం లేని తెలంగాణలోని ఈ ఊరి గురించి తెలుసా..?

    Tags