https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ అక్కగా మారనున్న ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ !

Pawan Kalyan: ఒకప్పటి హోమ్లీ హీరోయిన్.. ఇప్పటి సీనియర్ హీరోయిన్ మీనాకి సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఆమె ఇప్పటికీ సినిమాల్లో వరుసగా నటిస్తోంది. పైగా కేరళాలో మీనాకి ఫుల్ క్రేజ్ కూడా ఉంది. ఆమె నుంచి వచ్చిన గత సినిమా పెద్దన్న డిజాస్టర్ అయింది. అయినా, ఆ సినిమాలో మీనా తన పాత్రతో అదరగొట్టింది. వయసు అయిపోయినా.. తనలోని గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి ఘనంగా చాటుకుంది. అందుకే, ప్రస్తుతం మీనాకు […]

Written By:
  • Shiva
  • , Updated On : December 22, 2021 / 02:57 PM IST
    Follow us on

    Pawan Kalyan: ఒకప్పటి హోమ్లీ హీరోయిన్.. ఇప్పటి సీనియర్ హీరోయిన్ మీనాకి సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఆమె ఇప్పటికీ సినిమాల్లో వరుసగా నటిస్తోంది. పైగా కేరళాలో మీనాకి ఫుల్ క్రేజ్ కూడా ఉంది. ఆమె నుంచి వచ్చిన గత సినిమా పెద్దన్న డిజాస్టర్ అయింది. అయినా, ఆ సినిమాలో మీనా తన పాత్రతో అదరగొట్టింది.

    Meena

    వయసు అయిపోయినా.. తనలోని గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి ఘనంగా చాటుకుంది. అందుకే, ప్రస్తుతం మీనాకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించనుంది. ఐతే, ఈ సినిమా నుంచి ఇంతవరకు ఎలాంటి అప్ డేట్ లేదు. సినిమా చేస్తున్నాం అని ప్రకటించారు గాని, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ? లాంటి అంశాల పై క్లారిటీ ఇవ్వలేదు.

    కానీ హరీష్ శంకర్ టీంలో నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం.. మే నుంచి ఈ చిత్తాన్ని స్టార్ట్ చేయనున్నారు. కాగా ఈ సినిమాలో పవన్ కి అక్క పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని.. ఇప్పుడు ఆ పాత్రలో మీనాని తీసుకునే ఆలోచనలో హరీష్ శంకర్ ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి మీనా ఖాతాలో మరో భారీ సినిమా పడింది.

    తనకు వరుస తెలుగు సినిమాలు వస్తున్నాయి కాబట్టే.. ఈ మధ్య తన ఫిజిక్ కూడా తగ్గించింది మీనా. స్లిమ్ గా మారి పర్ఫెక్ట్ ఫిగర్ ను మెయింటైన్ చేయడానికి కఠినమైన కసరత్తులు చేస్తోంది. అయితే, సినిమా ఛాన్స్ లు పెరిగినంత మాత్రానా ఇప్పుడు ఇలా ఉన్నట్టు ఉండి కుర్ర హీరోయిన్ లా మారిపోతే వచ్చే ఆంటీ పాత్రలు కూడా రావమ్మా అంటూ ఆమెకు కొందరు సినీ ప్రముఖులు సలహాలు ఇస్తున్నారట.

    Also Read: Radhe Shyam: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్​ హోస్ట్​గా జాతిరత్నాలు హీరో

    కానీ మీనా మాత్రం తనదైన శైలిలోనే ముందుకు పోతుంది. పైగా హీరోయిన్ గా అవకాశం రావాలే గానీ, ఇప్పుడు కూడా తానూ గ్లామర్ రోల్స్ లో సై అంటుంది. అన్నట్టు మీనా ఆర్ధికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది, ఆ ఇబ్బందులను దాటడానికి ఆమె ఇలా మళ్లీ సినిమాల ఫోకస్ పెట్టింది.

    Also Read: South Indian Heroins: ప్రేమలు మళ్లీ మళ్లీ విఫలమయ్యాయి కొత్త జీవితాన్ని ప్రారంభించిన హీరోయిన్స్ వీళ్ళే?

    Tags