Homeజాతీయ వార్తలుKcr- Prakash Raj: కీలక స్థానం నుంచి ప్రకాష్ రాజ్ పోటీ.. కేసీఆర్ అంత...

Kcr- Prakash Raj: కీలక స్థానం నుంచి ప్రకాష్ రాజ్ పోటీ.. కేసీఆర్ అంత పెద్ద త్యాగం చేస్తున్నారేంటి..?

Kcr Prakash Raj: సీఎం కేసీఆర్ ఏ పని చేసినా చాలా ముందు జాగ్రత్తతోనే చేస్తుంటారు. అయితే తన వ్యూహాలను మాత్రం అంత ఈజీగా బయటకు రానివ్వరు. వ్యూహం అమలైన తర్వాతనే దాని గురించి మాట్లాడుతారు. కాగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకాష్ రాజు పేరు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు కారణం కూడా సీఎం కేసీఆర్. మొన్న ముంబై వెళ్ళినప్పుడు తన గ్రూప్ వెంట ప్రకాష్ రాజ్ ను తీసుకెళ్లి అనేక అనుమానాలకు తెర తీశారు.

Kcr- Prakash Raj
Kcr- Prakash Raj

అయితే ఇప్పుడిప్పుడే ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వ్యక్తం అవుతున్నాయి. 2014లోనే ప్రకాష్ రాజ్ ను టీఆర్ఎస్ లోకి కేసీఆర్ ఆహ్వానించారని తెలుస్తోంది. అయితే అప్పుడు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేని ప్రకాష్ రాజ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ గా ఉన్నట్టు సమాచారం. ప్రశాంత్ కిషోర్ తోటి వ్యూహాలు రచిస్తున్నాయి కేసీఆర్.. ప్రకాష్ రాజు కు గజ్వేల్ ను అప్పగించనున్నారంట. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయం ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి కెసిఆర్ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Also Read:  ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి వేటు తప్పదా.. ఆయన ప్లేస్ లో వచ్చేది అతనేనట..

ఇందులో భాగంగానే మొన్న గజ్వేల్ అభివృద్ధి పనులను కూడా ప్రకాష్ రాజ్ దగ్గరుండి పరిశీలించినట్లు సమాచారం. అయితే గజ్వేల్ లో ఛాన్స్ దొరికితే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్న వంటేరు ప్రతాపరెడ్డి ప్రస్తుతం అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్నారు. మరి ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగితే ప్రతాప్ రెడ్డి టిఆర్ఎస్ లోనే ఉంటారా.. లేక తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరి రేవంత్ పక్కన నిలుస్తారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ప్రతాప్ రెడ్డి మొదటినుంచి కేసీఆర్ మీద అసహనం ఉన్నమాట వాస్తవమే.

Kcr Prakash Raj
Prakash Raj

ప్రస్తుతం గజ్వేల్ లో టీఆర్ఎస్ తప్ప మరే పార్టీ గెలిచే అవకాశాలు లేవని తెలిసిన తర్వాతనే ప్రకాష్ రాజ్ ఇందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి అంతగా ప్రకాష్ రాజ్ ను కేసీఆర్ చేరదీయడానికి గల బలమైన కారణం ఏంటనేది క్లుప్తంగా ఎవరికీ తెలియట్లేదు. జాతీయ రాజకీయాల్లో తన సమన్వయకర్తగా ప్రకాష్ రాజు ను ఉపయోగించుకోవాలని ప్రస్తుతానికి కెసిఆర్ నిర్ణయించుకున్నారు. మరి కెసిఆర్ ఇంత చేస్తున్నా.. ప్రకాష్ రాజ్ తన వంతుగా కేసీఆర్ కు ఎలాంటి లాభం చేకూర్చుతారనేది వేచి చూడాలి.

Also Read:పోలవరంపై కేంద్రం హామీలు సరే.. నిలబెట్టుకుంటదా.. నమ్మొచ్చా..?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

Comments are closed.

Exit mobile version