https://oktelugu.com/

రేవంత్, షర్మిల ఎఫెక్ట్: కేసీఆర్ 50వేల ఉద్యోగాల ప్రకటన

ఓవైపు కొత్తగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి.. మరోవైపు కొత్త పార్టీ పెట్టిన రేవంత్ రెడ్డిది మొదటి డిమాండ్ ఒకటి.. తెలంగాణ కోసం కొట్టాడిన యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని.. దీనికోసం పోరుబాట పట్టేందుకు వారు రెడీ అయ్యారు. ఇదే జరిగితే మరో ఉద్యమం తప్పదని భయపడ్డారో ఏమో కానీ కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. తెలంగాణలో ఉద్యోగాల జాతరను మొదలుపెట్టారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారిన ‘ఉద్యోగాల’పై కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెంటనే వివిధ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 9, 2021 / 07:31 PM IST
    Follow us on

    ఓవైపు కొత్తగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి.. మరోవైపు కొత్త పార్టీ పెట్టిన రేవంత్ రెడ్డిది మొదటి డిమాండ్ ఒకటి.. తెలంగాణ కోసం కొట్టాడిన యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని.. దీనికోసం పోరుబాట పట్టేందుకు వారు రెడీ అయ్యారు. ఇదే జరిగితే మరో ఉద్యమం తప్పదని భయపడ్డారో ఏమో కానీ కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. తెలంగాణలో ఉద్యోగాల జాతరను మొదలుపెట్టారు.

    తెలంగాణలో ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారిన ‘ఉద్యోగాల’పై కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెంటనే వివిధ శాఖల్లోని 50వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

    నూతన జోనల్ విధానం అడ్డంకులు తొలగడంతో ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించాలని.. రెండో దశలో వాటిని భర్తీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల బర్తీ అంశంపై ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. స్థానికులకు న్యాయం జరగాలనే నూతన జోనల్ విధానం కోసం ఆగామని.. ఉమ్మడి పాలనలో ఉద్యోగాల భర్తీలో అన్యాయం జరిగిందని.. ఈసారి అలా కాకుండా జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టామని కేసీఆర్ తెలిపారు. జోనల్ వ్యవస్థ ఆమోదంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయాయని కేసీఆర్ అన్నారు.

    డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కింద అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50వేల దాకా ఖాళీగా ఉన్నాయని.. వాటిని ముందుగా భర్తీ చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని.. తద్వారా ఏర్పడిన ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తామని కేసీఆర్ తెలిపారు.

    ఉద్యోగాల భర్తీపై పూర్తి సమాచారంతో నివేదిక సిద్దం చేసి కేబినెట్ సమావేశానికి తీసుకురండి అని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.ఈనెల 13న కేసీఆర్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి ఉద్యోగ ప్రకటనలు చేస్తామని కేసీఆర్ తెలిపారు.

    దీంతో దాదాపు ఏడేళ్లుగా ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులు ఇక చదువుల బాట పట్టనున్నారు. వారంతా తిరిగి శిక్షణ కోసం కోచింగ్ సెంటర్ల వైపు వెళ్లనున్నారు. ఈ ప్రకటనపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన ఎఫెక్ట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, షర్మిలదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.