KCR And KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి ప్రధాన కారణం నియంత ధోరణి, అహంకార పూరిత మాటలు. వీటికి టీఎస్‌పీఎస్పీ ప్రశ్నపత్రాల లీకేజీ, మేడిగడ్డ కుంగుబాటు, భూముల అమ్మకం, ఎమ్మెల్యేలు, కిందిస్థాయి నేతల దౌర్జన్యాలు తొడయ్యాయి. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోవడం మరో ప్రధాన కారణం. కానీ వీటిని కేసీఆర్‌గానీ, కేటీఆర్‌గానీ ఇప్పటికీ అంగీకరించడం లేదు. తమ ఓటమిని ఒప్పుకోవడం లేదు. కేవలం 1.4 శాంత ఓట్ల తేడాతో ఓడిపోయాం, ఇంకో 4 లక్షల ఓట్లు వస్తే మనమే అధికారంలోకి వచ్చేవాళ్లం అంటూ అదే అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజల తీర్పునే తప్పుడుతున్నారు.
ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేలా..
ఇదిలా ఉంటే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, మన్సూర్ అలీఖాన్ ఎన్నికయ్యారు. వీరి ప్రమాణ స్వీకారానికి సోమవారం ఏర్పాటు చేశారు. ఈమేరకు ఇద్దరు ఎమ్మెల్సీలు సోమవారం మండలికి వచ్చారు. కానీ, అక్కడ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కనిపించలేదు. కార్యదర్శి ద్వారా ఆయనకు సమాచారం ఇస్తే.. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఈనెల 31న ప్రమాణం చేయిస్తానని సమాచారం ఇచ్చారు. ఈ ధోరణి చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఇంకా గుత్తా సుఖేందర్‌రెడ్డి పనిచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ అహంకారపూరితంగా, క్షక్షసాధింపు ధోరణిలో ఇలా చేశారని తెలుస్తోంది.
ఉద్యమకారులను గౌరవించకుండా..
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎంత కీలకమో.. ప్రొఫెసర్ కోదండరామ్ కూడా అంతే కీలకపాత్ర పోషించారు. జేఏసీ చైర్మన్‌గా తెలంగాణలో అన్ని పార్టీలను ఉద్యమంవైపు నడిపించింది కోదండరామే. మిలియన్‌మార్చ్, సకల జనులు సమ్మె లాంటి నిర్ణయాలు కోదండరామ్‌వే. అంతేకాకుండా తెలంగాణలో 2014లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంలోనూ కోదండరామ్ కీలకపాత్ర పోషించారు. ఉద్యమ పార్టీకి మద్దతుగా నిలిచారు. కానీ, ఇవేమీ గుర్తించని కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించారు. ఉద్యమకారులను విస్మరించారు. కోదండరామ్‌కు, తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు పదవులు ఇవ్వాలని ఎంతమంది డిమాండ్ చేసినా పట్టించుకోలేదు.
మళ్లీ కక్షపూరితమే..
కేసీఆర్ కోదండరామ్‌కు పదవి ఇవ్వకపోగా, ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గుర్తించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఈమేరకు గవర్నర్ నియామకం చేశారు. జీవో కూడా వచ్చింది. కానీ, కోదండరామ్ ఎమ్మెల్సీ అవడం నచ్చని కేసీఆర్ అదే కక్షపూరితంగా ప్రమాణస్వీకారం అడ్డుకునేలా చైర్మన్‌తో అనారోగ్యం డ్రామా ఆడించారన్న ప్రచారం జరుగుతోంది. చైర్మన్ లేని పక్షంలో డిప్యూటీ చైర్మన్‌తో ప్రమాణం చేయించాలి. కానీ, గుత్తా సఖేందర్‌రెడ్డి తాను 31వ తేదీన వస్తానని, ఆరోజే ప్రమాణం చేయిస్తానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.