https://oktelugu.com/

మలి ప్రస్థానానికి కవిత తొలి అడుగులు?

కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత… మాటల మాంత్రికురాలిగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మహిళా నాయకురాలు. గత ఎన్నికల్లో నిజామాబాద్‌ ఓటమితో సైలెంట్‌ అయ్యారు. ఓటమి బాధతో ఇక రాజకీయాలతో సంబంధమే లేదని చెప్పినట్టె చెప్పి సైలంట్‌ గా దూసుకెళ్లడమే బెటరని డిసైడ్ అయ్యాయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కవితను చూసి బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. నిన్నటి వరకు ఎవ్వరికీ అపాయిట్‌ మెంట్లు ఇవ్వని కవిత, ఇప్పుడు కార్యక్షేత్రంలోకి దిగి క్యాడర్‌ తో కలిసిపోవాలని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 6, 2020 12:24 pm
    Follow us on

    Kavitha

    కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత… మాటల మాంత్రికురాలిగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మహిళా నాయకురాలు. గత ఎన్నికల్లో నిజామాబాద్‌ ఓటమితో సైలెంట్‌ అయ్యారు. ఓటమి బాధతో ఇక రాజకీయాలతో సంబంధమే లేదని చెప్పినట్టె చెప్పి సైలంట్‌ గా దూసుకెళ్లడమే బెటరని డిసైడ్ అయ్యాయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కవితను చూసి బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. నిన్నటి వరకు ఎవ్వరికీ అపాయిట్‌ మెంట్లు ఇవ్వని కవిత, ఇప్పుడు కార్యక్షేత్రంలోకి దిగి క్యాడర్‌ తో కలిసిపోవాలని డిసైడ్ అయినట్టున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ఎంత నచ్చచెప్పినా, ఏడాది పాటు ఓటమి బాధతో ఇంటివద్దే ఉన్నారు. నిజామాబాద్‌ పై కన్నెత్తి కూడా చూడలేదు. అంతేకాదు ఎవ్వరికీ అపాయింట్ మెంట్లూ ఇవ్వకుండా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఇక, కవిత రాజకీయల్లో దూరంగా ఉంటారని భావించారు.

    పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కవిత, నిజామాబాద్ ఓటమి దెబ్బకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకున్నారట. ఇదే సమయంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో కూడా అనుభవంలోకి తెచ్చుకున్నారట. అందుకే యాక్టివ్ పాలిటిక్స్ లోకి విధిగా రావాలని డిసైడ్ కావడంతో, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల నోటిఫికేష‌న్ ఆమెకు కలిసివచ్చింది. దీంతో కవిత ఎమ్మెల్సీ అవ్వడం లాంఛనమే.

    కవిత ఎమ్మెల్సీగానే కాకుండా కేబినేట్ లో బెర్త్ కూడా కన్‌ ఫాం అయ్యిందనే పొలిటికల్ టాక్ చక్కర్లు కొడుతోంది. దీనికి తోడుగా క‌విత ఇప్పుడు పూర్తిస్థాయిలో ఫీల్డ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ముందుగానే గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చి బిజెపిపై కత్తులు దూయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారట. అందుకే తాజాగా దేశవ్యాప్తంగా కొన్ని బొగ్గు గ‌నుల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేస్తూ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై, అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. ఓ అడుగు ముందుకేసి ఏకంగా బిజెపి దిష్ఠిబొమ్మల ద‌హ‌నాలు, 24 గంట‌ల సింగరేణి స‌మ్మెకు క‌విత పిలుపునిచ్చారు. దీంతో టిఆర్ఎస్ వ‌ర్గాల్లో ముఖ్యంగా సింగ‌రేణి కార్మిక సంఘాల్లో కొత్త జోష్ వ‌చ్చేసింది.

    కవిత పొలిటికల్ రీఎంట్రీ కేబినెట్‌ లో చోటుపై టిఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా ఖండించలేకపోతున్నారు. ఒకవేళ మంత్రివర్గంలో కవితకు చోటు దక్కితే, అటు సామాజికకోణంలో, ఇటు మహిళా కోటాలో ప్లస్ లు మైనస్ లు అన్నీ కూడా లెక్కకట్టారట. కవిత మలి ప్రస్థానం ఎలా వుండబోతోందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురుచూడాలి.