కేసీఆర్ ఎక్కడ.. ఇప్పుడు ఇదే చర్చ..!

కరోనా సమయంలో మీడియా ముందుకొచ్చి ప్రజలకు ధైర్యం చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం ఎక్కడ కన్పించడం లేదు. గడిచిన కొద్దిరోజులుగా ఆయన ఫౌమ్ హౌజ్ నుంచి బయటికి రావడం లేదని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో భారీ ఎత్తున కేసులు నమోదవుతున్న వేళ కేసీఆర్ మీడియా ముందుకు రాకపోవడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల ప్రగతి భవన్లో విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అక్కడ పనిచేసే వారందరినీ హోంక్వారంటైన్లోకి తరలించారు. వీరికి పాజిటివ్ రాకముందు […]

Written By: Neelambaram, Updated On : July 6, 2020 11:54 am
Follow us on


కరోనా సమయంలో మీడియా ముందుకొచ్చి ప్రజలకు ధైర్యం చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం ఎక్కడ కన్పించడం లేదు. గడిచిన కొద్దిరోజులుగా ఆయన ఫౌమ్ హౌజ్ నుంచి బయటికి రావడం లేదని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో భారీ ఎత్తున కేసులు నమోదవుతున్న వేళ కేసీఆర్ మీడియా ముందుకు రాకపోవడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల ప్రగతి భవన్లో విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అక్కడ పనిచేసే వారందరినీ హోంక్వారంటైన్లోకి తరలించారు. వీరికి పాజిటివ్ రాకముందు నుంచే కేసీఆర్ ప్రగతి భవన్ కి రావడం లేదని ప్రచారం జరిగింది.

వైరస్ ల ఖార్ఖానాగా చైనా ఎందుకు మారుతుంది?

కాగా కొందరు మాత్రం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నారని.. ఆయన కరోనా పాజిటివ్ రావడంతో అక్కడే చికిత్స చేయించుకుంటున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మరికొందరేమో ఆయన ఫౌంహౌజ్ లో ఉన్నారని చెబుతోన్నారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని హాట్ టాపిక్ గా మారింది. కరోనా విజృంభిస్తున్న వేళ సీఎం కేసీఆర్ ఫౌంహౌజ్ కు పరిమితమవడంపై విపక్షాలు పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారినపడ్డారు. ఇటీవలే రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కరోనా బారినపడి ఐదురోజుల చికిత్స అనంతరం కోలుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు ప్రయివేట్ ఆసుప్రతుల్లో ఉంటూ చికిత్స పొందుతున్నాయి. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ ప్రజాప్రతినిధులకు ప్రయివేట్లో చికిత్స అందిస్తుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!

కరోనా భయంతో నగరవాసులంతా సొంతూళ్లుకు వెళుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో ఇప్పటికే 20నుంచి 30శాతం ప్రజలు సొంతూళ్లకు పయనమ్యారు. దీంతో నగరరోడ్లన్నీ ఖాళీగా దర్శనిమిస్తున్నాయి. దీంతో నగరంలో ఎక్కడ చూసిన టూలెట్ బోర్డులే దర్శనమిస్తున్నారు. ఆదాయంలేక అద్దెలు చెల్లించలేక నగరంలో ఉండటం కంటే సొంతూళ్లకు వెళ్లడమే బెటరని వలస కార్మికులు ఇంటిముఖం పడున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడం కుండా ప్రభుత్వం ఇటీవల హరితహారం కార్యక్రమం ప్రారంభించింది. నేతలు, ప్రజాప్రతినిధులు గుంపులు గా పాల్గొంటూ భౌతిక దూరం పాటించడం లేదు. దీంతో కరోనా వ్యాపించే అవకాశం ఉండటంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కరోనా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు సీఎం కేసీఆర్ కొద్దిరోజులుగా ఫౌంహౌజ్ కే పరిమితమయ్యారనే వార్తలు వస్తున్నారు. కేసీఆర్ కూడా హోంకార్వంటైన్ తరలి వెళ్లారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో కేసీఆర్ ఎక్కడ ఉన్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. సోషల్ మీడియాలో నెటిజన్లు వేర్ ఈజ్ కేసీఆర్ అంటూ ప్రశ్నిస్తుండటం గమనార్హం. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే..!