MLC Kavitha : బ్రేకింగ్‌ : ఈడీకి షాకిచ్చిన కవిత.. విచారణకు డుమ్మా.. ఏం జరుగనుంది!?

MLC Kavitha ED : ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన కల్వకుంట్ల కవిత చట్ట ప్రకారం ఈడీ విచారణ నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో గురువారం ఈడీకే షాక్‌ ఇచ్చారు. ఈడీ విచారణ అంటేనే పెద్దపెద్ద వాళ్లు కూడా వణికిపోతారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి తనయ కవిత మాత్రం ఈడీకే షాక్‌ ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది. అనారోగ్య కారణంతో విచారణకు డుమ్మా.. ఈడీ విచారణకు వెళ్తానని ఒక […]

Written By: NARESH, Updated On : March 16, 2023 12:53 pm
Follow us on

MLC Kavitha ED : ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన కల్వకుంట్ల కవిత చట్ట ప్రకారం ఈడీ విచారణ నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో గురువారం ఈడీకే షాక్‌ ఇచ్చారు. ఈడీ విచారణ అంటేనే పెద్దపెద్ద వాళ్లు కూడా వణికిపోతారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి తనయ కవిత మాత్రం ఈడీకే షాక్‌ ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది.

అనారోగ్య కారణంతో విచారణకు డుమ్మా..
ఈడీ విచారణకు వెళ్తానని ఒక రోజు ముందే ఢిల్లీ వెళ్లిన కవిత, విచారణ జరిగే(16వ తేదీ)న ఉదయం నుంచే డ్రామాకు తెరలేపారు. 11 గంటల వరకు ఈడీ ఆఫీస్‌కు వెళ్లాల్సిన కవిత ఇల్లు దాటి బయటకు రాలేదు. సుమారు గంట తర్వాత న్యాయవాదుల ద్వారా ఈడీకి లేఖ పంపించారు. అనారోగ్యం, సుప్రీం కోర్టులో తీర్పు పెండింగ్‌ దృష్ట్యా ఈరోజు విచారణకు హాజరు కాలేనని పేర్కొన్నారు. ఈడీ ముందు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె ఈ– మెయిల్‌ ద్వారా అధికారులకు సమాచారం పంపారు. మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీంతో ఎవరూ ఊహించని విధంగా కవిత ఇచ్చిన షాక్‌తో ఈడీ అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారన్న విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. కవిత ఆమె విజ్ఞప్తిని ఈడీ అంగీకరిస్తుందా? లేదా? అనేది చూడాలి.

ఈనెల 11న సుదీర్ఘ విచారణ..
ఈ నెల 11న దాదాపు ఎనిమిది గంటల పాటు కవితను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు.. 16న మరోసారి విచారణకు రావాలని అదే రోజు సమన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, మళ్లీ హాజరుకావాలంటూ జారీ చేసిన సమన్లను సవాల్‌ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆమె దాఖలు చేసిన వ్యాజ్యంపై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈనెల 24న విచారణ చేపడతామని సీజేఐ స్పష్టం చేశారు. ఈ నెల 16న హాజరు కావడంపై ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సైతం కోర్టు నిరాకరించిన నేపథ్యంలో కవిత ఈరోజు ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో సమావేశం అనంతరం ఈడీకి ఈమెయిల్‌ పంపినట్టు సమాచారం. కవిత ఈడీ విచారణ దృష్ట్యా మంత్రులు కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్‌ ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు.

అన్న, బావ సమక్షంలో న్యాయ నిపుణులతో మంతనాలు..
విచారణకు హాజరు కావాల్సిన కవిత తన అన్న కేటీఆర్, బావ, మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఢిల్లీలోని కేసీఆర్‌ ఇంట్లో కల్వకుంట్ల కవిత న్యాయ నిపుణులతో సుదీర్ఘ మంతనాలు చేశారు. చట్ట ప్రకారం తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో కవిత చివరక అనారోగ్య కారాణాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది.

హైదరాబాద్‌ ఈడీ ఆఫీస్‌ వద్ద భారీ భద్రత
దిల్లీలో ఈడీ కార్యాలయంలో కవిత విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈడీ ఆఫీస్‌ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కవితకు మరోసారి ఈడీ నోటీసులకు నిరసనగా భారాస కార్యకర్తలు ముట్టడిస్తారేమోనని ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. ఈడీ కార్యాలయం ద్వారాన్ని మూసివేశారు.