Rajamouli vs Mahesh fans: ఈమధ్య కాలం లో రాజమౌళి(SS Rajamouli) లేకుండా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగడం లేదు. ప్రతీ ఈవెంట్ కి ఆయన ముఖ్య అతిథిగా హాజరు అవుతూ ఉన్నాడు. రేపు విడుదల కాబోతున్న జూనియర్(Junior Movie) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిన్న ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ చిత్రాన్ని ‘వారాహి చలన చిత్రం’ సంస్థ ద్వారా నిర్మించడం తో, రాజమౌళి కి వాళ్ళు అత్యంత సన్నిహితులు కాబట్టి ఆయన ఈ సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చాడు, అదే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వచ్చాడు. అయితే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు(Super Star Mahesh Babu) తో ఒక సినిమా చేస్తున్నాడు కాబట్టి, ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని అడగకుండా ఉండరు అనేది తెలిసిందే.
Also Read: ప్రభాస్ పేరు ప్రస్తావించని జెనీలియా..మండిపడుతున్న అభిమానులు!
నిన్న ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా అభిమానులు ‘జై బాబు’ అంటూ నినాదాలు చేశారు. అందుకు ఆయన సింపుల్ గా చిరునవ్వు నవ్వి సమాధానం దాటవేశాడు. కేవలం జూనియర్ చిత్రం గురించి మాత్రమే ఆయన మాట్లాడాడు. రాజమౌళి నోటి నుండి మహేష్ తో తీస్తున్న సినిమా గురించి చిన్న అప్డేట్ అయినా లీక్ అవుతుందేమో అని ఆశపడిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మహేష్ తో సినిమా మొదలు పెట్టి రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసి చాలా రోజులైంది. టాకీ పార్ట్ 20 శాతం కి పైగా పూర్తి అయ్యినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అంత షూటింగ్ జరిగినప్పటికీ కూడా మేకర్స్ నుండి చప్పుడు లేకపోవడం పై అభిమానుల్లో తీవ్రమైన నిరుత్సాహం ఏర్పడింది. కనీసం మా సినిమా మొదలైంది అనే అప్డేట్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక మహేష్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అవ్వడం లో కూడా న్యాయం ఉంది కదా.
Also Read: ‘హరి హర వీరమల్లు’ కు నిజాం రాజుకు ఏంటి సంబంధం..? చార్మినార్ కథలో ఎందుకు ఉంది?
త్వరలోనే సౌత్ ఆఫ్రికా లో మూడవ షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారట మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ కి సంబంధించిన వర్క్ షాప్ జరుగుతుందట. ఇకపోతే ఈ చిత్రం లో ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇందులో హీరోయిన్ క్యారక్టర్ చేస్తుందని అందరూ పొరపాటు పడ్డారు. కానీ ఇందులో ఆమె పూర్తిస్థాయి విలన్ క్యారక్టర్ లో కనిపించబోతుందట. పృథ్వీ రాజ్ సుకుమారన్ కి ఆమె జోడిగా కనిపించనుంది. మరి ఇందులో హీరోయిన్ రోల్ ఎవరు చేస్తున్నారు అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. బాలీవుడ్ నుండి ఒక యంగ్ హీరోయిన్ ని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆరోజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఎదో ఒక అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.