వ్యవసాయ బిల్లులపై రైతుల పోరుబాట.. రాష్ట్ర బంద్

అన్నదాతలు రోడ్డెక్కారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. లక్షలమంది రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ సోమవారం కర్ణాటక రాష్ట్ర బంద్ తో అట్టుడుకుతోంది. ఈరోజు బంద్ తో రైతులంతా బెంగళూరు నడిబొడ్డున ఉన్న టౌన్ హాల్ ముందు సోమవారం ఉదయం నిరసన పెద్దఎత్తున తెలిపారు. అన్ని సంఘాల నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. కర్ణాటక రైతులు భారీగా రోడ్లపైకి […]

Written By: NARESH, Updated On : September 28, 2020 11:14 am

karna

Follow us on


అన్నదాతలు రోడ్డెక్కారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. లక్షలమంది రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ సోమవారం కర్ణాటక రాష్ట్ర బంద్ తో అట్టుడుకుతోంది.

ఈరోజు బంద్ తో రైతులంతా బెంగళూరు నడిబొడ్డున ఉన్న టౌన్ హాల్ ముందు సోమవారం ఉదయం నిరసన పెద్దఎత్తున తెలిపారు. అన్ని సంఘాల నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. కర్ణాటక రైతులు భారీగా రోడ్లపైకి వచ్చి చేస్తున్న ఈ ఆందోళనతో రాష్ట్రమంతా అట్టుడుకుతోంది.

కాగా బెంగళూరుతోపాటు రాష్ట్రమంతటా బంద్, రైతుల నిరసనలతో రైతులు భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం రైతుల ఆందోళనకు మద్దతుగా ముందుండి ఈ బంద్ ను విజయవంతం చేస్తున్నాయి.

కేంద్ర, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక బిల్లులను పాస్ చేయించాయని నిరసిస్తూ సోమవారం బెంగళూరు నగరంతో సహా కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో రైతన్నలు ఆందోళనకు దిగారు. ఈ బిల్లులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

అన్నదాతలు కర్ణాటకలో చేస్తున్న ఈ బంద్ కు మొత్తం 108 సంఘాలు, సంస్థలు మద్దతు తెలుపడంతో భారీ ఆందోళనగా మారింది. కరోనా టైంలో ఇంత పెద్ద ఆందోళన దేశంలో ఇదే ప్రథమం కావడం గమనార్హం.