Also Read : బిగ్ బాస్: దేవి నాగవల్లి ఎలిమినేట్ కావడానికి కారణం అదే?
ఎలిమినేట్ అయిన దేవి బిగ్‌బాస్ వేదికపై వచ్చి నాగార్జునతో మాట్లాడారు. ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటని దేవిని అడుగగా.. తనకు తెలియదంటూ ఆన్సర్ ఇచ్చింది. టైటిల్ కొట్టాలని, లేడీ బాస్ అవ్వాలని హౌస్‌లోకి వెళ్లిన ఆమెకు ఊహించని ఎదురుదెబ్బ తగలడంతో షాక్‌లోనే ఉండిపోయింది. ఇంటి సభ్యులకు వ్యాల్యుబుల్ సలహాలు ఇచ్చింది.
ఇప్పటివరకు హౌస్ నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం సూర్యకిరణ్, రెండో వారం కరాటే కల్యాణి, మూడో వారం దేవీ నాగవల్లి హౌస్ నుంచి వెళ్లిపోయారు. అయితే.. వీరి ముగ్గురిలోనూ కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి.
వయసు రీత్యా మిగతా కంటెస్టెంట్స్ కంటే పెద్దవారు. ఈ ముగ్గురు కూడా హౌస్‌లో కొంచెం పెద్దరికం ప్రదర్శించాలని చూశారు. అది పెత్తనంలా ఉన్నా ఇతరులకు సలహాలు ఇవ్వడం.. గైడ్ చేయడం లాంటివి చేశారు. ఈ విషయంలో కల్యాణి కొంచెం తక్కువే అయినా వయసులో పెద్ద అనే ఫీలింగ్‌ను మాత్రం కనబరిచారు. అయితే ఈ ముగ్గురు ఎలిమినేట్ కావడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
Also Read : బిగ్‌బాస్ 4 లో స్వాతి దీక్షిత్