తెలుగు రాష్ర్టాల్లో సేవలపై కరణం మల్లేశ్వరి కీలక వ్యాఖ్యలు

భారత దేశానికి ఒలంపిక్స్ లో పతకం సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన కరణం మల్లేశ్వరిని పట్టించుకోకపోవడం బాధాకరం. రెండు రాష్ర్టాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆమె సేవలను వినియోగించలేకపోయాయి. దీంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ర్టాలకు సేవలందించకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మహిళకు సముచిత స్థానం కల్పించకపోవడం యాదృచ్ఛికం కాకపోయినా పట్టింపు లేదనే విషయం తెలుస్తోంది. కరణం మల్లేశ్వరిని ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి తొలి వైస్ చాన్సలర్ గా అమ్ ఆద్మీ పార్టీ […]

Written By: Srinivas, Updated On : June 24, 2021 5:38 pm
Follow us on

భారత దేశానికి ఒలంపిక్స్ లో పతకం సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన కరణం మల్లేశ్వరిని పట్టించుకోకపోవడం బాధాకరం. రెండు రాష్ర్టాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆమె సేవలను వినియోగించలేకపోయాయి. దీంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ర్టాలకు సేవలందించకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు మహిళకు సముచిత స్థానం కల్పించకపోవడం యాదృచ్ఛికం కాకపోయినా పట్టింపు లేదనే విషయం తెలుస్తోంది. కరణం మల్లేశ్వరిని ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి తొలి వైస్ చాన్సలర్ గా అమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నియమించింది. దీంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా అనేక మంది అభినందించారు.

తెలుగు మహిళ వైస్ చాన్సలర్ కావడం అదృష్టమని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. తెలుగువారు ఆమె సేవలు వినియోగించుకోలేకపోయినా ఢిల్లీ లాంటి రాష్ర్టం గుర్తించడం ఆహ్వానించదగ్గ విషయమేనని తెలిపారు. 2000 సంవత్సరంలో తాను ఒలంపిక్ పతకం సాధించినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందన్నారు.

గ్రామీణ యువత నుంచి క్రీడాకారులను తయారు చేసే విధంగా అకాడమీని ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తానని చెప్పి తరువాత మరిచిపోయారన్నారు. తరువాత కొన్నేళ్లకు కలెక్టర్ ను కలిసి అకాడమీ ఏర్పాటుపై చర్చించినా అది ముందుకు సాగలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత వైసీపీ, తెలంగాణ ప్రభుత్వాలు సైతం ఎప్పుడు తనతో సంప్రదించలేదని చెప్పారు.