https://oktelugu.com/

జగన్ దెబ్బకు దెబ్బ సిద్ధాంతంలో భాగమేనా ఇది?

టీడీపీ వైసీపీ పార్టీల మధ్య విగ్రహాల రాజకీయం మొదలైంది. ఇటీవల కావలి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించినట్లు అధికారులు చెప్పడం జరిగింది. స్థానిక టీడీపీ కార్యకర్తలు, నేతలు దీనిని తీవ్రంగా విమర్శించారు. వైసీపీ కార్యకర్తలే, ఉద్దేశ పూర్వకంగా కూల్చి వేశారని అంటున్నారు. టీడీపీ కార్యకర్తలు, చందాలతో ఏర్పాటు చేసుకున్న తన ప్రియతమ నాయకుడి విగ్రహాన్ని కక్ష పూరితంగా తొలగించారంటూ ఆరోపించడం జరిగింది. ఇక నారా లోకేష్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 21, 2020 / 10:22 AM IST
    Follow us on


    టీడీపీ వైసీపీ పార్టీల మధ్య విగ్రహాల రాజకీయం మొదలైంది. ఇటీవల కావలి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించినట్లు అధికారులు చెప్పడం జరిగింది. స్థానిక టీడీపీ కార్యకర్తలు, నేతలు దీనిని తీవ్రంగా విమర్శించారు. వైసీపీ కార్యకర్తలే, ఉద్దేశ పూర్వకంగా కూల్చి వేశారని అంటున్నారు. టీడీపీ కార్యకర్తలు, చందాలతో ఏర్పాటు చేసుకున్న తన ప్రియతమ నాయకుడి విగ్రహాన్ని కక్ష పూరితంగా తొలగించారంటూ ఆరోపించడం జరిగింది. ఇక నారా లోకేష్ ట్విట్టర్ లో సదరు వీడియో పోస్ట్ చేయడంతో పాటు ఇది… వైసీపీ ప్రభుత్వ దుశ్చర్యగా అభివర్ణించారు.

    22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..

    అలాగే టీడీపీ నేతలు అందరూ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఐతే ఇది సీఎం జగన్ ఫాలో అవుతున్న దెబ్బకు దెబ్బ సిద్ధాంతంలో భాగమే అని కొందరు భావిస్తున్నారు. 2012లో పోలవరం ప్రాజెక్టు నమూనాతో విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్లో వైఎస్ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 12 అడుగుల ఎత్తయిన ఈ కాంస్య విగ్రహాన్ని రూ.30 లక్షల ఖర్చుతో నాటి ఎంపీ లగపాటి రాజగోపాల్ సమకూర్చారు. దీన్ని తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేటలో శిల్పి వడయార్ రూపొందించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్ని 2016లో అర్థ రాత్రి చడీ చప్పుడు లేకుండా తొలగించారు. జగన్ అధికారంలోకి వచ్చాక వైస్ విగ్రహాన్ని అదే స్థానంలో మరింత ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు.

    కన్నాపై అదిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందా?

    అప్పటి టీడీపీ ప్రభుత్వం వైస్ విగ్రహం పట్ల చేసిన అవమానకర చర్యకు ప్రతీకారమే కావలిలో ఎన్టీఆర్ విగ్రహ తొలగింపు అని కొందరు అంటున్నారు. అలాగే కావలిలో మరో చోట ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనుండగా, దాని ఆవిష్కరణకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి పిలవాలనేది వైసీపీ నేతల ఆలోచనట. ఈ నిర్ణయం టీడీపీ నేతలకు పుండు మీద కారం చల్లినట్లు అవుతుంది. ఇప్పుడిప్పుడే వేడెక్కుతున్న ఈ విగ్రహాల రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి