Kapus Vote: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న శాసించే స్థితిలో ఉన్న కాపులు వచ్చే ఎన్నికల నాటికి ఏకం కాబోతున్నారా..? పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు కాపులను ఆలోచనలో పడేసిందా..? ఇతర బీసీ కులాలతో కలిసి కాపులు సమైక్యంగా అడుగులు ముందుకు వేస్తారా..? రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది.
మచిలీపట్నం వేదికగా నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభ సరికొత్త రాజకీయ లెక్కలకు కారణమవుతోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన చర్చ తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి వెళ్తాయా..? విడివిడిగా పోటీ చేస్తాయా. అయితే మచిలీపట్నం జనసేన ఆవిర్భావ సభ తర్వాత రాజకీయ విశ్లేషణలు కొత్త రూపును సంతరించుకున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి. ఇప్పటి వరకు కాపులు, బీసీలు ఎడముఖం, పెడముఖంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ రెండు వర్గాలను కలిపే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ మచిలీపట్నం సభ వేదికగా పిలుపునిచ్చారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు కారణం అవ్వాలని, కాపులు ముందుకు వస్తే మిగిలిన బీసీ కులాలు తమ వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనక సుదూర రాజకీయ ప్రణాళిక దాగి ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కాపుల్లో బలంగా రాజ్యాధికారకాంక్ష..
రాష్ట్రంలో మెజారిటీ జనాభా ఉన్న కాపులకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీలు నామమాత్రపు పదవులను కట్టబెట్టి వారిని తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నాయి. అయితే కాపులకు కావాల్సింది పదవులు కాదని, రాజ్యాధికారమని అనేకమంది కాపులు పేర్కొంటున్నారు. అయితే ఆ రాజ్యాధికారం సాధించే దిశగా ఏకీకృతమైన ప్రయత్నాలు సాగకుపోవడం వలన రాజ్యాధికారకాంక్ష నెరవేరడం లేదు. కొన్నేళ్ల కిందట రంగా రూపంలో ఆకాంక్ష నెరవేరుతుందని భావించినప్పటికీ ఆయన మరణంతో ఆ ఆశలను కాపులు వదులుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలోను పెద్ద ఎత్తున కాపులు ఏకీకృతమై సీఎం పీఠం లక్ష్యంగా అడుగులు వేశారు. అయితే ప్రజారాజ్యం పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోవడం, ఆ తరువాత పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేయడం తదితర కారణాలతో మళ్ళీ కాపులు రాజ్యాధికార కాంక్షను వదులుకున్నారు. తమకు అవకాశాలు ఇచ్చే పార్టీలవైపు మొగ్గు చూపి చేరిపోయారు. అయితే జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత మళ్లీ కాపు నేతలు, కాపుల్లో ఆ కోరిక మరోసారి పునరుత్తేజితం పొందింది. ఒకప్పుడు రంగా, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పుడు కాపుల్లో కలిగిన బలమైన కోరిక.. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేనతో బలంగా వినిపిస్తోంది.
కాపులను కదిలిస్తుందా..
రాష్ట్ర రాజకీయాల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు కాపులను కదిలిస్తుందా..? అన్నది ఇప్పుడు పెద్ద చర్చినీయాంశంగా మారింది. కాపుల్లో మెజారిటీ పవన్ కళ్యాణ్ పిలుపుపట్ల ఆసక్తిని కనబరుస్తున్నప్పటికీ.. కొందరిలో మాత్రం ఏదో ఒక మూల అనుమానం వేధిస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో జనసేన పార్టీకి ఇబ్బందులు తప్పవు అన్న భావన వారిలో వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆ తరువాత కాలంలో చంద్రబాబు అండ్ కో ఏ విధంగా అబాసుపాలు చేసింది పలువురు కాపు నేతల గుర్తు చేస్తున్నారు. అటువంటి అపోహలు ఉన్న నేతలంతా పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుపట్ల ఏ విధంగా స్పందిస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Recommended Video: