Congress Party: దేశాన్ని ఎన్నో ఏళ్ళపాటు అప్రతిహతంగా ఏలిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న కాంగ్రెస్ ను, దేశాన్ని వేర్వేరుగా చూడలేమని ఎంతోమంది మేధావులు చెబుతుంటారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి రాకపోవడంతో క్యాడర్ లో నిస్తేజం అలుముకుంది. దీనికితోడు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం చవిచూడటం జీర్ణించుకోలేని ఆపార్టీ నేతలే అధినాయకురాలిపై ధిక్కారస్వరంగా విన్పిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి గెలుపొటములు కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మోదీ-అమిత్ ద్వయం ముందు సోనియా-రాహుల్ వ్యూహాలు ఏమాత్రం పని చేయడం లేదు. యూపీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అన్ని తానై ప్రచారం చేసినా కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. దీనికితోడు పంజాబ్ లో కాంగ్రెస్ చేజేతులారా అధికారాన్ని చేజార్చుకోవడంతో ఆపార్టీలోని అసమ్మతి నేతలకు కలిసి వచ్చింది.
Also Read: Pawan Kalyan vs YCP: పవన్ ‘ప్రకటన’ను తప్పు దారి పట్టిస్తున్న వైసీపీ
ఇదే అదనుగా గతంలో జీ-23 అంటూ పాపురాలైన కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు సోనియా, రాహుల్ నాయకత్వంపై ప్రశ్నలవర్షం కురిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన కపిల్ సిబల్ ఒక అడుగు ముందుకేసి గాంధీ ఫ్యామిలీ స్వచ్చంధంగా కాంగ్రెస్ నాయకత్వం నుంచి తప్పుకోవాలంటూ మోహం మీద చెప్పేస్తున్నారు. రాహుల్ తప్పుడు నిర్ణయాలతోనే కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లోనూ ఓటమి పాలైందని విమర్శలు గుప్పించారు.
పంజాబ్ ఎన్నికల సమయంలో చన్నీని సీఎం అభ్యర్ధిగా రాహుల్ గాంధీ ప్రకటించడాన్ని కపిల్ సిబల్ తప్పుబట్టారు. చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించటానికి ఆయనుకున్న అధికారం ఏంటని నిలదీయడం ఆశ్చర్యంగా మారింది. అయితే కపిల్ సిబల్ వ్యాఖ్యలను పార్టీలోని పలువురు సీనియర్లు తప్పుబడుతున్నారు. ఆయన మాటాలు ఆర్ఎస్ఎస్, బీజేపీ మాటాల్లా ఉన్నాయని మండిపడుతున్నారు.
ఏదిఏమైనా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకీ మీరే దిక్కు అంటూ సోనియాగాంధీని బ్రతిమిలాడిన నేతలే నేడు మీరు తప్పుకుంటేనే పార్టీ బాగుపడుందని అనడం చూస్తేంటే తాడే పామై కారుస్తుందా? అన్న సామెత గుర్తుకు రాకమానదు. ఇప్పుడు కాంగ్రెస్ ను విమర్శిస్తున్న నేతలంతా కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా కాకుండా రాజ్యసభ సీట్లతో లబ్ధిపొందిన వారే కావడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ గతంలో మాదిరిగానే బలంగా లేదని మాత్రం స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పోరాటాలను కాకుండా కేవలం ప్రజా వ్యతిరేకతను మాత్రమే నమ్ముకోవడమే ఆపార్టీ కొంపముంచుతుందనేది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కాంగ్రెస్ నేతలతా ప్రజాక్షేత్రంలోకి దిగి పోరాటాల బాటపట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే రాబోయే రోజుల్లో హస్తం పార్టీ అడ్రస్ గల్లంతు కాక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: Kapu Reservation: ఏపీని ‘కాపు’ కాస్తానంటున్న బీజేపీ.. కేంద్రం ప్రకటనతో ఇరుక్కున వైసీపీ!