Rajamouli Interesting Comments On Ram Gopal Varma: నేషనల్ రేంజ్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. వచ్చే వారం ఈ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ క్రమంలో రాజమౌళి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో రామ్ గోపాల్ వర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి మాటల్లోనే.. ‘మగధీర సినిమా తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు చేయకూడదని.. ముఖ్యంగా ఎక్కువ రోజులు షూటింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయం ప్రకారమే.. ‘ఈగ’, ‘మర్యాద రామన్న’ సినిమాలు చేయడం జరిగింది.
అయితే, ‘బాహుబలి’ సినిమా తర్వాత కూడా నేను ఇక భారీ బడ్జెట్ సినిమాలు తీయను అని చెప్పాను. కానీ ఈ విషయంలో అలా ఉండటం నా వల్ల కాలేదు. నేను మాట తప్పింది నిజమే. ఇలా తప్పడానికి నేను రామ్ గోపాల్ వర్మను స్ఫూర్తిగా తీసుకున్నాను’ అంటూ రాజమౌళి చమత్కరించాడు. మొత్తమ్మీద అబద్దాలు చెప్పడంలో ఆర్జీవీని ఇన్ స్పిరేషన్‌గా తీసుకున్నాను అని జక్కన్న చెప్పడం సరదాగా అనిపించింది.
Also Read: Congress Party: శరణు కోరినవారే భస్మాసూర ‘హస్తం’ అంటున్నారు..!
ఇక ఆర్ఆర్ఆర్.. అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నేషనల్ రేంజ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పైగా నిజమైన మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏ రకంగా చూసుకున్నా.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయం అంటున్నారు మేకర్స్. అన్నిటికీ మించి ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.
పైగా ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ టీజర్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్, మరియు ట్రైలర్ అండ్ సాంగ్స్ విడుదలైయి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అన్నట్టు ఈ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే.. కొన్ని వేలమంది ప్రాణాలను కాపాడటానికి ఎన్టీఆర్ పాత్ర కావాలని ప్రాణ త్యాగం చేస్తోందని.. ఈ సీక్వెన్స్ వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది.
Also Read: Pawan Kalyan vs YCP: పవన్ ‘ప్రకటన’ను తప్పు దారి పట్టిస్తున్న వైసీపీ