Kapil Sibal: కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఓ వైపు ప్రయత్నాలు చేస్తోంటే మరో వైపు నేతలు పార్టీని వీడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామా చేశారు. దీంతో పార్టీకి కోలుకోలేని విధంగా నష్టపోతోందని తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ డోలాయమానంలో పడుతోంది. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నా అది అంత సులువు కాదనే విషయం స్పష్టమవుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏం చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు. కపిల్ సిబల్ జీ23 నేతల్లో ఒకరు కావడం గమనార్హం.

దేశంలో గుజరాత్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఉత్తర ప్రదేశ్ లో మాత్రం రెండే స్థానాల్లో ఉంది. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం సాధించిపెట్టాలని భావిస్తోంది. దీనికి గాను తెలంగాణలో పార్టీలోకి కొందరు నేతలను తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మిని పార్టీలో చేర్చుకుని ముందుకెళ్లాలని చూస్తోంది. కానీ నేతలు పార్టీని వీడితే మళ్లీ అనుమానంలోనే పడాల్సి వస్తోందనే వాదనలు వస్తున్నాయి. దీంతో పార్టీ ఎలా వ్యవహరిస్తుందనే దానిపై అందరికి అంచనాలు పెరిగిపోతున్నాయి.
కపిల్ సిబల్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడటంతో ఆయనకు సమాజ్ వాదీ పార్టీ మద్దతు ఇస్తోంది. దీంతో ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం పెత్తనంతో విసిగిపోయినట్లు తెలుస్తోంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారి కనుసన్నల్లోనే జరగడంతో సహనం నశించి పార్టీని వీడినట్లు చెబుతున్నారు. వారసత్వ రాజకీయాలతోనే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతున్నట్లు సమాచారం. ఈ విషయం అందరికి తెలిసినా ఎవరు కూడా నోరు మెదపరని పార్టీలో టాక్. దీంతోనే నేతలు ఇలా బయటకు వస్తున్నారు.

నిజానికి మే 16నే సిబల్ రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. కపిల్ సిబల్ 2016లోనే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. జులైలో ఆయన పదవీ కాలం పూర్తవుతున్నందున సమాజ్ వాదీ సహకారంతో మళ్లీ ఆయన రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని నేతలు వీడుతున్నందున దాని భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తమ పార్టీకి పనిచేయాలని కోరినా ఆయన నిరాకరించడంతో పార్టీ ఆలోచనలో పడిపోయింది.
రాబోయే ఎన్నికల్లో పార్టీ విధానం ఏమిటనేది అంతుచిక్కడం లేదు. పార్టీ నేతలను ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు. దీంతో పార్టీకి నష్టం కలిగించే వారి పట్ల ఉపేక్షించేది లేదని చెబుతోంది. కానీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇంకా ఏం ప్రణాళికలు రచించాలనే దానిపైనే దృష్టి సారిస్తోంది. పార్టీని వీడకుండా ఏం చేయాలనే దానిపై కూడా ప్రధానంగా తీసుకునే చర్యలపై అందరు సూచనలు చేస్తున్నారు. పార్టీని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.
Also Read:Jai Andhra Movement: జై తెలంగాణ సక్సెస్.. జై ఆంధ్రా ఫెయిల్.. ఎందుకిలా అయ్యింది?
Recommended videos



[…] Also Read: Kapil Sibal: కాంగ్రెస్ కు భారీషాక్.. ఉద్దండ పి… […]
[…] Read: Kapil Sibal: కాంగ్రెస్ కు భారీషాక్.. ఉద్దండ పి… Recommended […]