Puri Jagannadh: టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ కమర్షియల్ డైరెక్టర్స్ లో ఒక్కరు పూరి జగన్నాథ్..ఒక్కే మూసలో వెళ్తున్న తెలుగు సినిమా హీరోయిజం కి సరికొత్త నిర్వచనం తెలిపి ఇండస్ట్రీ లోనే ఒక్క బిగ్గెస్ట్ బ్రాండ్ గా అవతారం ఎత్తిన పూరి జగన్నాథ్ కి మార్కెట్ లో ఉన్న క్రేజ్ వేరు..కమర్షియల్ గా వరుసగా ఎన్ని ఫ్లాప్స్ పడినా కూడా పూరి జగన్నాథ్ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడుతారు..అయితే వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న పూరి జగన్నాథ్ కి అటు డైరెక్టర్ కీర్తి ప్రతిష్టలు మరియు నిర్మాతగా తిరుగులేని లాభాలను తెచ్చిపెట్టిన సినిమా ఇస్మార్ట్ శంకర్..ఈ సినిమా ఆయనకీ డైరెక్టర్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా ప్రారంభం అయ్యేలా చేసింది..ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో లైగర్ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో విడుదల కానుంది..ఇది పక్కన పెడితే పూరి జగన్నాథ్ కెరీర్ లో బద్రి అనే సినిమా ఎంత ప్రత్యేకమో మన అందరికి తెలిసిందే..అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు.
ఈ సినిమానే పూరి జగన్నాథ్ గారికి తొలి సినిమా..కానీ ఈ తొలి సినిమా ఛాన్స్ దక్కడానికి కారణం కూడా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం స్టోరీనే అవ్వడం విశేషం..ఎందుకంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ ని కలిసి ఒక్క దర్శకుడు స్టోరీ చెప్పాలి అంటే ముందుగా అతని మేనేజర్ కి స్టోరీ వినిపించాలి..అతని అప్పోయింట్మెంట్ తీసుకొని అతనికి కథ వినిపించిన తర్వాత నచ్చితేనే పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు అనుమతిని ఇస్తాడు..బద్రి స్టోరీ చెప్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అనే భయం తో పవన్ కళ్యాణ్ మేనేజర్ కి ముందుగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం స్టోరీ ని వినిపించాడు పూరి జగన్నాథ్..ఆయనకి బాగా నచ్చడం తో పవన్ కళ్యాణ్ తో అప్పోయింట్మెంట్ ఇప్పించి ఆ స్టోరీ ని పవన్ కళ్యాణ్ కి వినిపించే అవకాశం కల్పించాడు..కానీ పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత ఇటు శ్రావణి సుబ్రహ్మణ్యం స్టోరీ ని కాకుండా బద్రి సినిమా స్టోరీ ని వినిపించాడు..పవన్ కళ్యాణ్ కి ఆ స్టోరీ బాగా నచ్చడం తో ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు..అలా పూరి జగన్నాథ్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం స్టోరీ ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసి తొలి సినిమా తోనే భారీ హిట్ ని అందుకున్నాడు అన్నమాట.
ఇది ఇలా ఉండగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ సినిమా గా తెరకెక్కేముందు మరో ఆసక్తికరమైన సంఘటన కూడా చోటు చేసుకుంది..పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ పని చేస్తున్న కాలం లోనే ఆయన ఈ స్టోరీ ని సిద్ధం చేసుకున్నాడు..అప్పట్లో ఈ స్టోరీ ని ఒక్క సీరియల్ గా తీసే ఆలోచన మాత్రమే పూరి జగన్నాథ్ లో ఉంది..దీని కోసం ఆయన అప్పట్లో దూరదర్శన్ ఛానల్ చుట్టూ ప్రదిక్షణలు కూడా చేసాడు..కానీ దూరదర్శన్ ఛానల్ ఇందుకు అంగీకరించలేదు..తర్వాత ఈ సినిమాని సీరియల్ వెర్షన్ లో కాకుండా సినిమా వెర్షన్ కి మార్చాడు పూరి జగన్నాథ్..సినిమా వెర్షన్ కి మార్చిన తర్వాత ఈ స్టోరీ ని తొలుత హీరో సుమంత్ కి వినిపించాడు..కానీ ఆయనకీ ఎందుకో ఈ కథ నచ్చక రిజెక్ట్ చేసాడు..ఆ తర్వాత హీరో తరుణ్ తో చేద్దాం అనుకున్నాడు కానీ కుదర్లేదు..చివరికి అప్పుడప్పుడే హీరోగా మెల్లిగా నిలదొక్కుతున్న రవితేజ ని పెట్టి తీసాడు..ఇక ఆ తర్వాత ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి మన అందరికి తెలిసిందే..కంటెంట్ పరంగా మ్యూజిక్ పరంగా ఈ సినిమా అప్పట్లో ఒక్క సెన్సేషన్ అనే చెప్పొచ్చు..ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు..సినిమా సినిమాకి ఎదుగుతూ టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ మాస్ డైరెక్టర్ గా ఒక్క ప్రత్యేకమైన స్థానం ని ఏర్పరచుకున్నాడు పూరి జగన్నాథ్.