విదేశీ కార్పొరేట్ సంస్థలు భారతీయతను అవమానిస్తున్నాయి. ముఖ్యంగా నిన్నటికి నిన్న ప్రఖ్యాత అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సంస్థ ‘కన్నడ భాష’ను అవమానించి పెనుదుమారం రేపింది. కర్ణాటక ప్రజలు, ప్రభుత్వం సీరియస్ కావడంతో దెబ్బకు దిగి వచ్చి క్షమాపణలు చెప్పింది.
ఇప్పుడు అమెజాన్ వంతు వచ్చింది. అమెజాన్ సంస్థ తాజాగా తన ఈకామర్స్ వెబ్ సైట్ లో లోదుస్తులపై కన్నడ రాష్ట్ర చిహ్నం, పతాకం రంగులు ముద్రించి అమ్మకానికి పెట్టడం పెను దుమారం రేపింది. కన్నడిగుల ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఉన్న ఆ సంస్థ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కన్నడ అభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు టీఎస్ నాగాభరణ శనివారం స్పందించారు. కన్నడిగుల ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఉన్న ఆ సంస్థ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక కన్నడ భాషా సంఘాలు ప్రభుత్వం కూడా తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతిస్తూ అవమనిస్తే ఊరుకోమని అమెజాన్ సంస్థపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సంస్థపై తీవ్ర విమర్శలు చేశారు.
ఇక కన్నడ ప్రభుత్వం స్పందించింది. కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద అమెజాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఇలా ప్రఖ్యాత అమెరికన్ దిగ్గజ సంస్థలు భారత్ లోని కన్నడిగులను అవమానించిన తీరు దుమారం రేపింది. ఒక భాష వారిని రెండు సంస్థలు ఇలా కించపరచడం వివాదానికి కారణమైంది.