https://oktelugu.com/

అగ్రిగోల్డ్ కేసు : కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

ఒకటి కాదు రెండు.. జనాల్ని నమ్మించి మోసం చేసి వేలకోట్లు తన్నుకుపోయిన గద్దలు అగ్రిగోల్డ్ యజమానులు.. అప్పనంగా వేలకోట్లు సేకరించి, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేశారు. దీనిపై బాధితులు రోడ్డెక్కడం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ యజమానులను అరెస్ట్ చేసి జైలు పాలు చేసింది. అయినా కూడా ఈ వ్యవహారం రెండు రాష్ట్రాలు ఉదాసీనంగా వ్యవహరించాయి.. బాధితుల డబ్బుల రికవరీలో నిర్లప్తతగా వ్యవహరించడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఈ కుంభకోణంలో ఉన్నట్టే కనిపిస్తోంది.. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2020 / 07:01 PM IST
    Follow us on

    ఒకటి కాదు రెండు.. జనాల్ని నమ్మించి మోసం చేసి వేలకోట్లు తన్నుకుపోయిన గద్దలు అగ్రిగోల్డ్ యజమానులు.. అప్పనంగా వేలకోట్లు సేకరించి, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేశారు. దీనిపై బాధితులు రోడ్డెక్కడం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ యజమానులను అరెస్ట్ చేసి జైలు పాలు చేసింది. అయినా కూడా ఈ వ్యవహారం రెండు రాష్ట్రాలు ఉదాసీనంగా వ్యవహరించాయి.. బాధితుల డబ్బుల రికవరీలో నిర్లప్తతగా వ్యవహరించడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఈ కుంభకోణంలో ఉన్నట్టే కనిపిస్తోంది..

    Also Read: కాంగ్రెస్ స్వయంకృతం: జగన్‌ని పిలిస్తే వస్తాడా..?

    తాజాగా అగ్రిగోల్డ్ కుంభకోణంకి ముందు కొనుగోలు చేసిన ప్లాట్లకు అద్దెను జమచేయాలని కోరుతూ సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఫార్చూన్ హేలాపురి అపార్ట్ మెంట్ ఓనర్స్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటీషన్ వేశారు. ఈ వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఈ ఏడాది జూన్ లో జారీ చేసిన నోటీసులను రద్దు చేసింది.

    ఏపీలో అగ్రిగోల్డ్ చాలా మంది ప్రజల వద్ద డిపాజిట్లు సేకించి ఉడాయించింది. అగ్రిగోల్డ్ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది.

    Also Read: నూతన్ నాయుడుపై నాలుగో కేసు.. దిమ్మదిరిగే వాస్తవాలు

    అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంతో ముడిపెడుతూ ఆ కంపెనీ నుంచి గతంలో ఆస్తులు కొనుగోలు చేసిన పలువురికి అద్దె చెల్లించాలంటూ సీఐడీ ఇచ్చిన నోటీసులను ఉన్న హైకోర్టు రద్దు చేసింది. ఈ తరహా తాఖీదుల జారీ చట్ట విరుద్ధమని పేర్కొంది.

    ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్తిని జప్తు చేయడమంటే దానిని ఇతరులకు విక్రయించకుండా తాకట్టుపెట్టకుండా నిలువరించడానికే గానీ వాటిపై అద్దె వసూలు చేయడానికి కాదని పేర్కొంది.