https://oktelugu.com/

ముగిసిన జీహెచ్ఎంసీ పోలింగ్: ఈసారి ఎంత తక్కువ ఓటింగ్ శాతమంటే?

అందరూ అనుమానించినట్టే గ్రేటర్ ఓటరు గడప దాటి కాలు బయటపెట్టలేదు. తన బద్దకాన్ని ఈసారి కూడా ప్రదర్శించాడు. ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న నానుడి నిజం చేస్తూ.. రాజకీయ నాయకులు, సినీ హీరోలు , పోలీసులు, అధికారులు ‘ఓటేయండి’ అని ఎంత మొత్తుకున్నా.. ఈ ఎన్నికల పండుగకు దూరంగా హైదరాబాద్ ఓటర్లు ఎంజాయ్ చేయడం రాజకీయవర్గాలను, మేధావులను అసహనానికి గురిచేసింది. Also Read: విజయశాంతి దాచేస్తే దాగదుగా? […]

Written By:
  • NARESH
  • , Updated On : December 1, 2020 / 08:58 PM IST
    Follow us on

    అందరూ అనుమానించినట్టే గ్రేటర్ ఓటరు గడప దాటి కాలు బయటపెట్టలేదు. తన బద్దకాన్ని ఈసారి కూడా ప్రదర్శించాడు. ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న నానుడి నిజం చేస్తూ.. రాజకీయ నాయకులు, సినీ హీరోలు , పోలీసులు, అధికారులు ‘ఓటేయండి’ అని ఎంత మొత్తుకున్నా.. ఈ ఎన్నికల పండుగకు దూరంగా హైదరాబాద్ ఓటర్లు ఎంజాయ్ చేయడం రాజకీయవర్గాలను, మేధావులను అసహనానికి గురిచేసింది.

    Also Read: విజయశాంతి దాచేస్తే దాగదుగా? ‘కాషాయ’ ప్రేమ సల్లగుండ?

    జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ఎట్టకేలకు ముగిసింది. మొత్తం 30 సర్కిళ్ల పరిధిలోని 149 డివిజన్లలో పోలింగ్ జరిగింది. నగర వ్యాప్తంగా చెదురుముదురు ఘటనలు జరిగాయి. ఓల్డ్ మలక్ పేటలో సీపీఐ, సీపీఎం గుర్తులు తారుమారు కావడంతో అక్కడ పోలింగ్ ఆపి రీపోలింగ్ చేయాలని అధికారులు డిసైడ్ అయ్యారు. ఈనెల 3న అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తారు.

    రీపోలింగ్ దృష్ట్యానే ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ కు ఎన్నికల కమిషన్ నిషేధించింది. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

    ఇక సాయంత్రం 6 గంటలలోగా క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు.నగరంతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైంది. ఆర్సీ పురం, పటాన్ చెరు, అంబర్ పేట సర్కిళ్లలో అత్యధికంగా ఓటింగ్ నమోదు చేశారు. మలక్ పేట, కార్వాన్ సర్కిళ్లలో అత్యల్ప ఓటింగ్ నమోదైంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 35.80 ఓటింగ్ శాతం నమోదైనట్టు అధికారులు అధికారికంగా తెలిపారు.

    Also Read: కొత్త వివాదం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కూతురు దొంగ ఓటు వేశారా?

    50వేలమందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 60 ఫ్లయింగ్ స్క్వాడ్ లు , 30 స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీములు నియమించారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు అమలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో అతిపెద్ద డివిజన్ మైలార్ దేవ్ పల్లి కాగా.. అతిచిన్న డివిజన్ రాంచంద్రాపురం.

    ఓటింగ్ కోసం మొత్తం 18202 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. పలు కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ విధుల్లో 36 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు.

    గ్రేటర్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 74,67,256 మంది. ఇక పోలింగ్ కోసం ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు బారులు తీరారు. జంట నగరాల పరిధిలో 9101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహించారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్