https://oktelugu.com/

Nara Lokesh – KA Paul : లోకేష్ ఎవడికి కావాలి.. కేఏ పాల్ మళ్లీ కామెడీ

"చివరికి పాల్ తో కూడా తిట్లు తింటున్నారంటే లోకేష్ ఎలా మాట్లాడుతున్నాడో అతడికే తెలియాలని" వ్యాఖ్యానిస్తున్నారు.. "ఇప్పటికైనా టిడిపి నాయకులు బుద్ధి మార్చుకోవాలని" హితవు పలుకుతున్నారు. పాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : February 20, 2024 / 11:54 PM IST
    Follow us on

    మనిషి అన్నాకా కాసింత కళాపోషణ ఉండాలి . అప్పట్లో ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాల్ రావు ఓ డైలాగ్ అది. పాలిటిక్స్ అన్నాకా అప్పుడప్పుడు కామెడీ ఉండాలి. లేకుంటే బుర్ర బద్దలుయిపోద్ది.. ఈ డైలాగును చేతల్లో చూపిస్తున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అప్పట్లో తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు వేడిగా ఉన్న రాజకీయ వాతావరణాన్ని చల్లపరిచేందుకు జీవన్ రెడ్డి, బండ్ల గణేష్, మల్లారెడ్డి వంటి వారు ప్రయత్నించినప్పటికీ.. ఆశించినంత స్థాయిలో అది విజయవంతం కాలేదు. పాల్ వస్తారని, ఏదో చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఓటర్ల అంచనాలను అందుకోలేకపోయారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు తనదైన మార్క్ కామెడీ పండించలేకపోయాననే బాధనో, మరొకటో తెలియదు గానీ.. ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పాల్ ఒక్కసారిగా అక్కడి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో కామెడీతో అలరిస్తున్నారు.

    రాజకీయాలలో పరస్పరం విమర్శలు చేసుకోవడం మాత్రమే తెలిసిన నాయకులతో పోలిస్తే కేఏ పాల్ చాలా భిన్నం. చాలా విషయాల్లో కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. పత్రికా విలేకరులు చిల్లర వ్యాఖ్యలు చేస్తే బుద్ధి చెబుతారు. ఎదుటివాడు చెప్పింది పాల్ అస్సలు వినిపించుకోరు. తాను చెప్పింది వినేదాకా వదిలిపెట్టారు. అలాంటి పాల్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను విమర్శించారు. రాజకీయాలు అన్నాకా విమర్శలు సహజమే. కానీ నారా లోకేష్ ను పాల్ సంబోధించిన విధానమే ఒకింత ఇబ్బందికరంగా ఉంది. “చంద్రబాబు నాయుడు నా ముందు 22 సార్లు నిల్చున్నాడు. కేసులు నమోదైతేనే తన అపాయింట్మెంట్ దొరుకుతుందని లోకేష్ వ్యాఖ్యానించడం సరికాదని” పాల్ అన్నారు.

    పాల్.. నారా లోకేష్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నాయకులు స్పందిస్తున్నారు. “పాల్ ఎన్నికల ముందు భలే కామెడీ చేస్తున్నారని” కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ నాయకులు కూడా స్పందిస్తున్నారు. “నారా లోకేష్ కు పాల్ గట్టిగానే క్లాస్ పీకుతున్నారని” ఎద్దేవా చేస్తున్నారు. “చివరికి పాల్ తో కూడా తిట్లు తింటున్నారంటే లోకేష్ ఎలా మాట్లాడుతున్నాడో అతడికే తెలియాలని” వ్యాఖ్యానిస్తున్నారు.. “ఇప్పటికైనా టిడిపి నాయకులు బుద్ధి మార్చుకోవాలని” హితవు పలుకుతున్నారు. పాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.