Revanth Reddy And KA Paul: తెలంగాణకు భారీగా పెట్టుబడులు తెస్తానని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ ప్రకటించారు. తను, తన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరాడు. మునుగోడు ఉప ఎన్నికల్లోపాల్ పోటీ చేశారు. డిపాజిట్ కూడా రాలేదు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేయలేదు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణకు భారీగా పెట్టుబడులు తెస్తానని ముందుకు వచ్చారు కేఏ.పాల్.
హైదరాబాద్‌లో గ్లోబల్ సమ్మిట్..
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ శాంతి సదస్సును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పాల్. ఈ సదస్సుకు ప్రపంచంలోని పలుదేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు ప్రపంచంలోని వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు మంగళవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఇద్దరూ సదస్సుపై చర్చించారు. అనంతరం పాల్ మాట్లాడారు. అక్టోబర్ 2న హైదరాబాద్ వేదికగా ప్రపంచ శాంతి సదస్సు, ఆర్థిక సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందస్సుకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించారని తెలిపారు. సదస్సుకు శాంతి దూతలు, ఇన్వెస్టర్లు హాజరు కావాలని కోరారు.
రేవంత్‌రెడ్డితోనూ చెపిపంచారు..
తర్వాత పాల్ ఇన్వెస్టర్లను ఆహ్వానించాలని సీఎం రేవంత్‌ను కోరారు. ఈమేరకు సీఎం కూడా తెలంగాణలో నిర్వహించే సదస్సుకు శాంతి ప్రతినిధులు, ఇన్వెస్టర్లు హాజరు కావాలని కోరారు. ఈమేరకు వీడియోను కేఏ.పాల్ విడుదల చేశారు. హైదరాబాద్‌కు పెట్టుబడులు తెచ్చేలా సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. పాల్ అధ్యక్షతన జరిగే సదస్సుకు ఇన్వెస్టర్లు రావాలని సీఎం కోరారు.
పెట్టుబడిదారులను మరియు ప్రపంచ నాయకులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌లో కేఏ పాల్ నిర్వహించాలనుకుంటున్న గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమ్మిట్‌కు ఒకే చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. pic.twitter.com/ztryBzMXep
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2024