https://oktelugu.com/

Automatic Car: ఆటోమేటిక్ కార్లలో బెస్ట్ 5 ఇవే.. ధరలు చాలా ఛీప్..

మాన్యువల్ గేర్ బాక్స్ తో ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే స్పీడ్ తగ్గుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆటోమేటిక్

Written By: , Updated On : January 30, 2024 / 04:22 PM IST
Cheapest-Automatic-Cars
Follow us on

Automatic Car:కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని మోడళ్లకు ప్రాధాన్యత పెరిగింది. మొన్నటి వరకు కేవలం ఎస్ యూవీ కార్ల కోసం మాత్రమే వెతికేవారు. కానీ ఇప్పుడు కొన్ని కంపెనీలు హ్యాచ్ బ్యాక్ కార్లలో ఫీచర్స్ అప్డేట్ చేయడంతో పాటు ఎస్ యూవీ రేంజ్ లో ఉత్పత్తి చేయడంతో చాలా మంది చిన్న కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. హ్యాచ్ బ్యాక్ కార్లలో 5 స్పీడ్ మాన్యువల్ గేర్లు ఉంటాయి. అయితే మాన్యువల్ గేర్ బాక్స్ తో ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే స్పీడ్ తగ్గుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆటోమేటిక్ గేర్ల కార్ల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆటోమేటిక్ గేర్ల కార్లలో బెస్ట్ 5 గురించి తెలుసుకుందాం..

మారుతి నుంచి వివిధ మోడళ్లు వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఇందులో ఇగ్నిస్ కారు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఇదిSUV కాకపోయినా ఆ రేంజ్ తో అనిపిస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 88 బీహెచ్ పీ పవర్ ను అందించి AMT ని కలిగి ఉంది. దీనిని రూ.6.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాటా నుంచి పంచ్ ను సైతం ఆటోమేటిక్ గేర్ బాక్స్ కారుగా చెప్పుకుంటున్నారు ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 87 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తూ 115 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని రూ.7.50 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ అమ్మకాల్లో దూసుకుపోతుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎక్స్ టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 82 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది AMT తో కలిగి ఉండి ఎస్ యూవీ రేంజ్ లో సౌకర్యంగా ఉంటుంది. మారుతి నుంచి మరో మోడల్ ఫ్రాంక్ష్ సైతం ఆటోమేటిక్ గేర్ బాక్స్ గా పేరొందింది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. దీనిని 8.88 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

రెనాల్ట్ కంపెనీ గురించి తెలియని వారుండరు.ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన కిగర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో అందుబాటులో ఉంది. ఇది ఈ మోడల్ మూడు విభిన్న ట్రాన్స్ మిషన్ ల ఎంపికలో లభిస్తుంది. దీనిని 7.10 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. కొత్తగా కార్లు కొనేవారు మాన్యువల్ కంటే ఏఎంటీని ఎక్కువగా ఇష్టపడుతున్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఈ కార్ల ఉత్పత్తి వైపు దృష్టి పెడుతున్నాయి.