https://oktelugu.com/

Ka Paul : నేను ప్రపంచపు ఎనిమిదవ వింత..

వాస్తవానికి కేఏ పాల్ మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. నిజానికి అతడు మంచి వక్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతడు ప్రసంగిస్తే లక్షల మంది వినేవారు. కానీ కాలం కలిసి రాకపోవడంతో ఆయన ఒక జోకర్ లాగా మారిపోయారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 16, 2024 9:28 pm
    KA Paul Meets Amit Shah

    KA Paul

    Follow us on

    Ka Paul : ఏపీ రాజకీయాలు మంచి హీట్ మీద ఉన్నాయి. అధికార, ప్రతిపక్షాలు తోట పోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. దీంతో జనాలకు ఎంటర్టైన్మెంట్ కరువైంది. అయితే దానిని భర్తీ చేసే పనిని కేఏ పాల్ మొదలుపెట్టారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఆడపాదడపా కేఏ పాల్ మెరిశారు.. ఏదో వ్యాఖ్యలు చేశారు. కానీ అవి జనాలకు ఆ స్థాయిలో వినోదాన్ని పంచ లేకపోయాయి. అప్పట్లో మునుగోడు ఎన్నికల్లో పాల్ చూపించిన హాస్య చతురత ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రదర్శించలేకపోయారు. అయితేనేం ఆ లోటును ఏపీ ఎన్నికల ద్వారా తీర్చుతున్నారు. తన మాటలతో, హావభావాలతో రక్తి కట్టిస్తున్నారు. నవ్వులు తెప్పిస్తున్నారు.. ఆకాశానికి, సముద్రానికి లంకె వేసినట్టు ఆయన మాట్లాడిన మాటలు మామూలుగా లేవు. మరీ ముఖ్యంగా శనివారం పాల్ చేసిన వ్యాఖ్యలు న భూతో న భవిష్యత్.

    ఆయన వల్లే జరుగుతున్నాయట

    ప్రతిసారి తన గురించి తాను గొప్పగా చెప్పుకునే పాల్.. శనివారం కూడా అంతకుమించి అనే స్థాయిలో చెప్పుకున్నారు. ఎదుటివారికి ప్రశంసించే అవకాశాన్ని ఇవ్వకుండా ఆయనకు ఆయనే ప్రశంసించుకున్నారు. దైవంశ సంభూతుడిగా కీర్తించుకున్నారు. తాను అపర మేధావినని చెప్పుకున్నారు.. బ్రాహ్మండాలను బద్దలు చేయగల శక్తి సంపన్నుడినని గొప్పలు పోయారు. “నేను హైకోర్టులో పిటిషన్ వేయడం వల్లే రాష్ట్రంలో మే నెలలో ఎన్నికలు జరుపుతున్నారు. నేను ప్రపంచంలో ఎనిమిదవ వింతను. ఎవరి వద్దా బోయింగ్ 747 విమానం లేనప్పుడు నేను సాధించా. లక్షల మంది అనాధలను పోషించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎందుకు అమ్ముతున్నారని నేను ప్రశ్నిస్తేనే అది ఆగింది. ఎన్నికలు కూడా ఏప్రిల్ నెలలో జరగకుండా ఆపానని” పాల్ వ్యాఖ్యానించడంతో ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారు. సీరియస్ రాజకీయాల నుంచి కాస్త ఉపశమనం లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    వాస్తవానికి కేఏ పాల్ మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. నిజానికి అతడు మంచి వక్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతడు ప్రసంగిస్తే లక్షల మంది వినేవారు. కానీ కాలం కలిసి రాకపోవడంతో ఆయన ఒక జోకర్ లాగా మారిపోయారు. రాజకీయాలలో కామెడీ పీస్ గా అయిపోయారు. సోషల్ మీడియా వల్ల పాల్ కామెడీని జనం ఆస్వాదిస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలను ఆనందిస్తున్నారు. ఒకవేళ ఈ సోషల్ మీడియా లేకుంటే జనం పాల్ ను మిస్సయ్యే వారు. ఆయన కామెడీని కోల్పోయేవారు. ప్రపంచపు ఎనిమిదవ వింతగా ఉన్న పాల్ ఎంతైనా అభినందనీయుడు.