KA Paul KomatiReddy: కేఏ పాల్, కోమటిరెడ్డి అలయ్ బలయ్.. ఈ వీడియో చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే?

KA Paul KomatiReddy: ప్రపంచ శాంతి దూత, క్రైస్తవ మత ప్రబోధకుడు అయిన మన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తుంటారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో బరిలోకి దిగి ఎంత హల్ చల్ చేశాడో చూశాం. రాజకీయ వేడిలో కామెడీ పంచి ప్రజలను, నేతలను సేదతీర్చారు.ఎన్నికలు వస్తే చాలు అమెరికా నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాలిపోతారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఉప ఎన్నికలు వచ్చేశాయి. మునుగోడుపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ […]

Written By: NARESH, Updated On : October 17, 2022 7:01 pm
Follow us on

KA Paul KomatiReddy: ప్రపంచ శాంతి దూత, క్రైస్తవ మత ప్రబోధకుడు అయిన మన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తుంటారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో బరిలోకి దిగి ఎంత హల్ చల్ చేశాడో చూశాం. రాజకీయ వేడిలో కామెడీ పంచి ప్రజలను, నేతలను సేదతీర్చారు.ఎన్నికలు వస్తే చాలు అమెరికా నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాలిపోతారు.

ఇప్పుడు తెలంగాణలోనూ ఉప ఎన్నికలు వచ్చేశాయి. మునుగోడుపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో ఫోకస్ చేసి సీరియస్ గా ముందుకెళుతుండగా.. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో కానీ కేఏపాల్ మునుగోడులో ప్రత్యక్ష మయ్యాడు. తన ప్రజాశాంతి పార్టీ తరుఫున ప్రచారమూ మొదలుపెట్టేశాడు.

ఇక ప్రచారంలో భాగంగా మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తారసపడ్డాడు. దీంతో వీరిద్దరూ పాత పగలు , సెగలు అన్ని మరిచిపోయి అలయ్ బలయ్ ఇచ్చుకున్నారు. కేఏ పాల్ ను వినమ్రంగా రాజగోపాల్ రెడ్డి హగ్ చేసుకొని కృతజ్ఞతలు తెలిపారు. వీరిద్దరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉప ఎన్నికల్లో తనకు మద్దతును ఇవ్వాలని ఏకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే కేఏ పాల్ కోరడం విశేషం. బీజేపీ తరుఫున నిలబడ్డ కోమటిరెడ్డి ఈ ప్రతిపాదనకు అవాక్కవ్వడం విశేషం. తనను గెలిపిస్తే 60 నెలల్లో మునుగోడును అభివృద్ధి చేస్తానని.. మరో అమెరికా చేస్తానంటూ పాల్ గొప్పలకు పోయాడు.

రాజకీయాల్లో ఎవర్ గ్రీన్ కామెడీ చేసే పాల్ తో నీ కామెడీ ఏంటి రాజగోపాల్ అంటూ పలువురు కామెంట్ చేస్తున్న పరిస్థితి. అస్సలు పోటీనే కానీ పాల్ తో ఆ వంగి దండాలంటి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఇక కేఏ పాల్ రాకను ఓ పోలీస్ అధికారి గమనించాడో లేదో కానీ ఈయనను పట్టించుకోకుడా పక్కకు తప్పుకోవాలని ఆదేశించాడు. ప్రపంచ శాంతి దూతను తననే అవమానిస్తావా? అంటూ పాల్ రెచ్చిపోయాడు. నాకు కేంద్ర హోంమంత్రి తెలుసు, తెలంగాణ డీజీపీ తెలుసు.. నీ పోస్ట్ ఊస్ట్ చేయిస్తా బిడ్డా అంటూ రెచ్చిపోయాడు. ఇలా పాల్ మునుగోడు సీరియస్ పాలిటిక్స్ లో కాస్తంత కామెడీ పంచుతూ ముందుకెళుతున్నాడు.

https://twitter.com/TeenmarMallanna/status/1581617037126012929?s=20&t=h5rb1nHweu45z0JWe8qPqA