Mrs India: ఈ ఏడాది మిసెస్ ఇండియా కాంపిటీషన్లో తెలుగమ్మాయి విజేతగా నిలిచింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ పోటీల్లో విజయవాడకు చెందిన బిల్లుపాటి మల్లిక ఈ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. పేజెంట్స్ ప్రైవేట్ ఇండియా ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు మిసెస్ ఇండియా- 9వ సీజన్ పోటీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 24 మంది మహిళలు ఈ అందాల పోటీల్లో పాల్గొనగా.. ఈ క్రమంలోనే అన్ని రౌండ్లలో విజయం సాధిస్తూ ఫైనల్స్ కి 12 మంది బరిలో నిలబడ్డారు.

కాగా, ఆ తుడి పోటీల్లో అందర్నీ పక్కను నెట్టి మిసెస్ ఇండియా కిరీటాన్ని మల్లిక కైవసం చేసుకుంది. మల్లిక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సమాచారం ప్రకారం.. తను విజయవాడకు చెందిన అమ్మాయి కాగా, తండ్రి పేరు సుంకర దుర్గాప్రసాద్. ఎంబీఏ పూర్తి చేసిన ఈమె.. 2019లో శ్రీమతి అమరావతి టైటిల్‌ను గెలుచుకున్నారు. ఆ తర్వాత 2020లో వర్చువల్‌గా నిర్వహించిన మిసెస్ ఏపీ అందాల పోటీల్లో రెండో స్థానంలో గెలుపొందిన సంగతి తెలిసిందే.
కాగా, ఇప్పుడు ఏకంగా మిసెస్ ఇండియా బరిలో దిగి కిరీటాన్నే సొంతం చేసుకున్నారు మల్లిక. ప్రస్తుతం ఆమెకు 19కే ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన ఫొటోలను ఫాలోవర్స్కోసం పెడుతూ.. అలరిస్తుంటుంది.