ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ విషయంలో వైద్యులు ముందడుగు వేశారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ ఎలా వస్తుందో స్పష్టమైన అవగాహన లేకపోయినట్టికి ఈ వైరస్ సోకినా వ్యక్తిని ఎన్ని రోజుల్లో గుర్తించవచ్చు.. ఎన్ని రోజులు చికిత్స అవసరం అన్న అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు వైద్యులు జరిపిన రీసర్చ్ లో కాని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
సర్వే ప్రకారం.. కేవలం ఐదు రోజుల వ్యవధిలో కరోనా వ్యాధి లక్షణాలను గుర్తించవచ్చని చెబుతున్నారు. విపరీతమైన జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ప్రారంభమైన రోజు నుంచి ఐదు రోజుల వరకు తగ్గకపోతే ఈ వ్యాధి లక్షణంగా గుర్తించవచ్చని వైద్య నిపుణులు చేసిన అధ్యయనాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. వ్యాధి లక్షణాలు ఉన్నంత మాత్రాన వైరస్ సోకినట్లు భావించనవసరం లేదని వైద్యుల అధ్యయనం మేరకు తెలుస్తోంది.
వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత చికిత్స అందించడానికి 14 రోజుల క్వారంటైన్ (తప్పనిసరిగా ఇసోలాటిన్ వార్డులో చికిత్స) సమయం అవసరం అని తెలుస్తోంది. వైద్య నిపుణుల అంచనా మేరకు కరోనా వైరస్ లక్షణాలు రోగగ్రస్థుడికి కనిపించిన తరువాత నెగిటివ్ అని తేలితే ఏ గొడవా లేదు.. పాజిటివ్ అని వస్తే మాత్రం దీనికి కచ్చితంగా 14 రోజుల వ్యవధిలో చికిత్స చేసి ఇంటికి పంపవచ్చని జాన్స్ హొప్‌కిన్స్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. వ్యాధి సోకిన వారిలో పదివేల మందికి ఒకలా ఉంటే 101 మందికి మరో రకంగా ఉంటుంది. పదివేల మందికి 14 రోజుల్లో చికిత్స నయం చేయగలిగితే మిగిలిన 101 మందికి మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది.