https://oktelugu.com/

కుటుంబ సభ్యుల ఎంట్రీతో మారిన సీన్.. ఆందోళనలో బిగ్ బాస్..!

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. అయితే గత సీజన్ కు భిన్నంగా ప్రస్తుత బిగ్ బాస్-4 కొనసాగుతోంది. కరోనా క్రైసిస్ లోనూ బిగ్ బాస్ నిర్వాహకులు షోను విజయవంతంగా నడిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రసుత్తం బిగ్ బాస్ 11వ వారానికి చేరుకుంది. బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంటుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. Also Read:  కాజల్ పెళ్లి ఖర్చు కంటే.. హనీమూన్ ఖర్చే ఎక్కువ.. షాకవుతున్న ఫ్యాన్స్..! […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2020 / 03:05 PM IST
    Follow us on

    తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. అయితే గత సీజన్ కు భిన్నంగా ప్రస్తుత బిగ్ బాస్-4 కొనసాగుతోంది. కరోనా క్రైసిస్ లోనూ బిగ్ బాస్ నిర్వాహకులు షోను విజయవంతంగా నడిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రసుత్తం బిగ్ బాస్ 11వ వారానికి చేరుకుంది. బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంటుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది.

    Also Read:  కాజల్ పెళ్లి ఖర్చు కంటే.. హనీమూన్ ఖర్చే ఎక్కువ.. షాకవుతున్న ఫ్యాన్స్..!

    కరోనా నేపథ్యంలో ఈసారి బయటి నుంచి వ్యక్తులకు బిగ్ బాస్ లోకి ఎంట్రీలేదని టాక్ విన్పించింది. ఈ విషయంలో మాత్రం బిగ్ బాస్ సంచలన నిర్ణయం తీసుకొని అందరికీ షాకిచ్చాడు. గత సీజన్లో కొనసాగిన ఆనవాయితీని ఈసారి కొనసాగించేందుకే బిగ్ బాస్ మొగ్గు చూపడం విశేషం. ఈక్రమంలోనే కంటెస్టెంట్ల ఇంటి సభ్యులు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

    బిగ్ బాస్-4 ప్రారంభ ఎపిసోడ్ కు అదిరిపోయే రేటింగ్ వచ్చింది. అయితే దానిని కాపాడుకోవడం నిర్వాహాకులు విఫలమయ్యాయి. ఈక్రమంలోనే రేటింగ్ పెంచుకోవడంలో భాగంగా నిర్వహికులు ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ అయితే ఇష్టపడుతున్నారో వాటిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఈక్రమంలోనే బిగ్ బాస్ లో గొడవలు.. కొట్లాటలు.. హగ్గులు.. ముద్దులు.. ఏడుపులను హైలెట్ చేసి చూపిస్తున్నారు.

    Also Read: కరోనా క్రైసిస్ నుంచి చిత్ర పరిశ్రమ కోలుకునేదెన్నడూ?

    బిగ్ బాస్ ప్రతీ సీజన్లోనూ ప్రీమియర్.. ఫైనల్ ఎపిసోడ్స్ తర్వాత అత్యధిక స్థాయిలో రెస్పాన్స్ వచ్చేది మాత్రం కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు వచ్చినప్పుడే. దీంతో ఈ సీజన్లలో కూడా ఇంటి సభ్యులకు ఎంట్రీ ప్రాధాన్యమిస్తూ హైలెట్ చేసి చూపిస్తున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వాళ్ల కోసం మెయిన్ డోర్ దగ్గర గాజుతో రూమ్ ఏర్పాటుచేసి మరీ లోపలికి పంపుతున్నారు.  అభిజిత్.. దెత్తడి హారిక.. అఖిల్.. అవినాష్ వాళ్ల మదర్స్ ఇప్పటికే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

    ఈ క్రమంలోనే గొడవల గురించి వాళ్ల మధ్య చర్చ జరిగింది. దీనిపై కంటెస్టెంట్స్ స్పందిస్తూ గొడవలను లైట్ తీసుకోమంటూ వాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పడం ఆసక్తిని రేపుతోంది. ఇప్పటివరకు హౌస్ లో శత్రువుల్లా ఉన్న వాళ్లంతా కలిసిపోయారు. ఇకపై వీరు గొడవల్లేకుండా ఉంటే షో చప్పగా సాగనుందని బిగ్ బాస్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. రేటింగ్ కోసం ఇంత కష్టపడి గేమ్ ప్లాన్ చేస్తుంటే కంటెస్టెంట్లు బిగ్ బాస్ కే షాకిస్తుండటం కొసమెరుపు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్