https://oktelugu.com/

బైడెన్ నిర్ణయం.. వారికెంతో ఊరట

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. హెచ్‌ 1 బీ వీసాలకు సంబంధించి ఊరటనిచ్చారు. హెచ్‌ 1 బీ వీసాపై అమెరికాఇలో పనిచేసే విదేశీ నిపుణుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ ట్రంప్‌ సర్కార్‌‌ తెచ్చిన నిబంధనను అమలును మరింత జాప్యం చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. మే 14 వరకూ దాని అమలును నిలిపివేస్తున్నట్లు కార్మిక శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. Also Read: 400 గ్రాముల గంజాయి,120 […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 13, 2021 / 02:56 PM IST
    Follow us on


    అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. హెచ్‌ 1 బీ వీసాలకు సంబంధించి ఊరటనిచ్చారు. హెచ్‌ 1 బీ వీసాపై అమెరికాఇలో పనిచేసే విదేశీ నిపుణుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ ట్రంప్‌ సర్కార్‌‌ తెచ్చిన నిబంధనను అమలును మరింత జాప్యం చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. మే 14 వరకూ దాని అమలును నిలిపివేస్తున్నట్లు కార్మిక శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

    Also Read: 400 గ్రాముల గంజాయి,120 ఫుల్ బాటిల్స్.. రేవ్ పార్టీలో విస్తుపోయే విషయాలు

    ఈ నిర్ణయంతో అమెరికాలో ఉద్యోగాన్ని ఆశించే ప్రవాసీయులకు, ముక్యంగా భారీతీయులను పెద్ద ఎత్తున లభ్దిచేకూరనుంది. స్వదేశీయులను మెప్పించడానికి ట్రంప్‌ విదేశీ నిపుణులకు కనీస వేతన నిబంధనను తీసుకొచ్చారు. దీనివల్ల సంస్థలు వేతనాల భారం తగ్గించుకోవడానికి విదేశీ ఉద్యోగుల స్థానంలో స్వదేశీయులను నియమించుకోవడానికి మొగ్గు చూపుతాయన్నది ఆయన వాదన.

    అయితే.. విదేశీ నిపుణులను పెద్ద ఎత్తున నియమించుకునే సంస్థల నుంచి దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మరోవైపు ప్రవాసీల్లోనూ ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బైడెన్‌ తాజా ఆదేశాలు వారికి ఊరటనిచ్చాయి. అయితే.. బైడెన్‌ సర్కార్‌‌ నిర్ణయాన్ని ఫెడరేషన్‌ ఫర్‌‌ అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ రిఫార్మ్‌ సంస్థ వ్యతిరేకించింది.

    Also Read: వైసీపీ మాదిరిగానే షర్మిల పార్టీ జెండా.. జగన్ ఒప్పుకుంటాడా? ప్రజలకు కన్ఫ్యూజ్ నే?

    ట్రంప్‌ ప్రభుత్వంలో తీసుకొచ్చిన నిబంధన అమెరికా ఉద్యోగులకు భద్రతనిస్తుందని.. దాన్ని అమలు చేయకపోవడం వల్ల ఇప్పటికే కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన వారి కష్టాలు మరింత ఎక్కువవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతోపాటు హెచ్‌1 బీ వీసాల జారీకి మళ్లీ లాటరీ పద్ధతిని అనుసరించడం కూడా సరికాదని అంతర్గత భద్రత శాఖకు తెలిపింది.