https://oktelugu.com/

Joe Biden: జోబైడెన్ మతి గతి తప్పిందా?వైరల్ అవుతున్న బైడెన్ వింత చేష్టలు

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఆయనకు ఏదో అయిందని అందరు వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు. తన స్థాయికి తగినట్లు కాకుండా మరోలా ఆయన ప్రవర్తన ఉండటంతో అందరు వింతగా చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గ్రీన్స్ బోరోలోని నార్త్ కరోలినా అగ్రికల్చర్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో బైడెన్ పోడియం వద్ద ప్రసంగించారు. అనంతరం ఆయనకు ఎవరో కరచాలనం ఇస్తున్నట్లు చేయి […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 16, 2022 11:06 am
    Follow us on

    Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఆయనకు ఏదో అయిందని అందరు వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు. తన స్థాయికి తగినట్లు కాకుండా మరోలా ఆయన ప్రవర్తన ఉండటంతో అందరు వింతగా చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గ్రీన్స్ బోరోలోని నార్త్ కరోలినా అగ్రికల్చర్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో బైడెన్ పోడియం వద్ద ప్రసంగించారు. అనంతరం ఆయనకు ఎవరో కరచాలనం ఇస్తున్నట్లు చేయి చాచారు.

    Joe Biden

    Joe Biden

    దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. బైడెన్ తీరుకు నవ్వుకున్నారు. ఆయనకు ఏమైందనే కామెంట్లు సైతం వస్తున్నాయి. అక్కడ ఎవరు లేకున్నా బైడెన్ చేయి చాచడంతో అందరు నవ్వుకున్నారు. అధ్యక్షుడు బైడెన్ మానసిక పరివర్తన సరిగా లేదనే వాదనలు కూడా వస్తున్నాయి. అగ్రరాజ్యానికి అధిపతిగా ఉన్న వ్యక్తి ఇలా చేయడం సమంజసంగా లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి.

    Also Read: Sajjala Ramakrishna Reddy- Vijayasai Reddy: ఆ ఇద్దరితోనే వైసీపీకి కొత్త తలనొప్పులు.. సజ్జల, విజయసాయిరెడ్డిలపై నేతల ఆగ్రహం

    కొన్ని క్షణాల పాటు ఇబ్బందిగా ప్రవర్తించిన బైడెన్ తక్షణమే సర్దుకున్నారు. తనను ఎవరో కలుసుకున్నట్లు ఫీలవడంతోనే ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పుకు అందరు చర్చించుకుంటున్నారు. 40 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆయన తాను పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశానని చెప్పుకోవడం విశేషం.

    Joe Biden

    Joe Biden

    బైడెన్ ప్రకటనపై ప్రత్యర్థి పార్టీలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎప్పుడు ప్రొఫెసర్ గా చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన కుటుంబం ఎక్కడుంది? ఆయన ఏ పని చేశారో తెలియజేయాలని ప్రశ్నిస్తున్నారు. దీంతో బైడెన్ ప్రవర్తన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ట్విటర్ వేదికగా బైడెన్ గురించి రకరకాల ప్రకటనలు వస్తున్నాయి. ఆయన జీవితంలో ఏం చేశారో సుదీర్ఘంగా ఓ వీడియో విడుదల చేయాలని అడుగుతున్నారు. మొత్తానికి బైడెన్ మరోమారు వార్తల్లో నిలవడం చర్చనీయాంశంగా మారింది.

     

    Also Read:Jagan Plan B: జగన్ ప్లాన్ ‘బీ’ రెడీ.. ‘మాజీ’లకు కూడా పదవులు..!

    Tags