https://oktelugu.com/

Vijayasai Reddy Vs Bandla Ganesh: జ‌నం నిన్ను చెప్పుతో కొడ‌తారు.. మా కులాన్నే తిడ‌తావా.. సాయిరెడ్డిపై రెచ్చిపోయిన బండ్ల‌..

Vijayasai Reddy Vs Bandla Ganesh: బండ్ల గ‌ణేశ్ ప‌వ‌న్‌కు పెద్ద అభిమాని. ప‌వ‌న్ ను ఎవ‌రేమ‌న్నా స‌రే.. వెంట‌నే రంగంలోకి దిగిపోయి చెడా మ‌డా తిట్టేస్తుంటారు ఆయ‌న‌. అయితే ఇప్పుడు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డిపై ప‌డ్డారు బండ్ల గ‌ణేశ్‌. ఈసారి ప‌వ‌న్ కోసం కాదండోయ్.. క‌మ్మ కులం త‌ర‌ఫున దిగారు. విజ‌యసాయి రెడ్డి క‌మ్మ కులం మీద చేసిన కామెట్లు త‌ప్పు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మీద వ‌రుస […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 16, 2022 / 11:24 AM IST
    Follow us on

    Vijayasai Reddy Vs Bandla Ganesh: బండ్ల గ‌ణేశ్ ప‌వ‌న్‌కు పెద్ద అభిమాని. ప‌వ‌న్ ను ఎవ‌రేమ‌న్నా స‌రే.. వెంట‌నే రంగంలోకి దిగిపోయి చెడా మ‌డా తిట్టేస్తుంటారు ఆయ‌న‌. అయితే ఇప్పుడు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డిపై ప‌డ్డారు బండ్ల గ‌ణేశ్‌. ఈసారి ప‌వ‌న్ కోసం కాదండోయ్.. క‌మ్మ కులం త‌ర‌ఫున దిగారు. విజ‌యసాయి రెడ్డి క‌మ్మ కులం మీద చేసిన కామెట్లు త‌ప్పు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

    Vijayasai Reddy Vs Bandla Ganesh

    ఈ క్ర‌మంలోనే ఆయ‌న మీద వ‌రుస పెట్టి ట్వీట్లు చేశారు బండ్ల గ‌ణేశ్‌. టీడీపీని అడ్డం పెట్టుకుని క‌మ్మ‌వారిని తిట్ట‌డం క‌రెక్ట్ కాద‌ని.. తాను కూడా క‌మ్మ కుల‌స్తుడినే అని.. కానీ టీడీపీ కాదంటూ స్ప‌ష్టం చేశారు. తిట్టాల‌నుకుంటే నేరుగా ఆ వ్య‌క్తి పేరు పెట్టి తిట్టాల‌ని.. కానీ ఇలా కులం పేరు పెట్టి.. ప్ర‌తి విష‌యంలోకి క‌మ్మ వారిని లాగడం ఏంట‌ని మండిప‌డ్డారు.

    Also Read: Joe Biden: జోబైడెన్ మతి గతి తప్పిందా?వైరల్ అవుతున్న బైడెన్ వింత చేష్టలు

    రాష్ట్రానికి పట్టిన దరిద్రం విజ‌యసాయి రెడ్డి అని, ఇలా కులం గొడ‌వ‌ల‌కు పాల్ప‌డితే ప్ర‌జ‌లు నిన్ను చెప్పు దెబ్బ‌లు కొడుతారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు జ‌గ‌న్ అంటే గౌర‌వం అని.. కానీ నువ్వు ఆ పార్టీలో చీడ‌పురుగువి అంటూ సాయిరెడ్డిపై కామెంట్లు చేశారు. విశాఖ ప‌ట్నంన‌పు దోచుకుని హైద‌రాబాద్‌కు త‌ర‌లిస్తున్నావంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

    ఇక త్వ‌ర‌లోనే జ‌గ‌న్‌కు నువ్వు వెన్ను పోటు పొడుస్తావంటూ దుమారం రేపారు బండ్ల‌. ఇక ఈ ట్వీట్ చేసినందుకు త‌న‌ను బ్లాక్ మేల్ చేసి మింగుతాడు ఈ సాయిరెడ్డి అంటూ దారుణ‌మైన కామెట్లు చేశారు బండ్ల గ‌ణేశ్‌. జ‌గ‌న్‌కు త‌న చెల్లెలు ష‌ర్మిల‌ను దూరం చేసిన ద్రోహి సాయిరెడ్డి అంటూ వివాదాస్ప‌ద కామెంట్లు చేశారు. ఇక చ‌రిత్ర నికు తిరిగి చ‌ర్ల‌ప‌ల్లి జైలునే చూపిస్తుందంటూ కాక రేపారు.

    Vijayasai Reddy Vs Bandla Ganesh

     

    అయితే విజ‌య‌సాయిరెడ్డిపై ఈ రేంజ్‌లో కామెంట్లు చేయ‌డ‌మే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధార‌ణంగా రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే.. ప‌వ‌న్‌ను ఎవ‌రైనా ఏమైనా అంటే త‌ప్ప స్పందించ‌ని బండ్ల‌.. ఇలా స‌డెన్ గా విరుచుకుప‌డ‌ట‌మే ఇప్పుడు షాక్ ఇస్తోంది. మ‌రి ఆయ‌నేమైనా క‌మ్మ కులం త‌ర‌ఫున వ‌కాల‌త్ పుచ్చుకున్నారా అంటే.. గ‌తంలో కూడా విజ‌యసాయి చాలాసార్లు ఇలా క‌మ్మ‌కులంపై కామెంట్లు చేశారు. కానీ అప్పుడెప్పుడూ పెద్ద‌గా పట్టించుకోని బండ్ల‌.. ఇప్పుడేదో తానే క‌మ్మ‌కులానికి బాధ్య‌త తీసుకుంటున్న‌ట్టు మాట్లాడ‌టం షాక్ అనే చెప్పాలి. మ‌రి బండ్ల కామెంట్ల‌కు సాయిరెడ్డి ఎలాంటి కౌంట‌ర్ ఇస్తారో చూడాలి.

    Also Read:Sajjala Ramakrishna Reddy- Vijayasai Reddy: ఆ ఇద్దరితోనే వైసీపీకి కొత్త తలనొప్పులు.. సజ్జల, విజయసాయిరెడ్డిలపై నేతల ఆగ్రహం

    Tags