Anupama: యూత్ లో ఊహించని స్థాయిలో అభిమానులను కలిగి ఉన్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరనే విషయం తెలిసిందే. స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లను సంపాదించుకోవడంలో అనుపమ ఫెయిల్ కాగా కెరీర్ తొలినాళ్లలో ఆమె చేసిన చిన్నచిన్న తప్పులు ఆమెకు మైనస్ గా మారాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది అనుపమ నటించిన రౌడీ బాయ్స్ ఇప్పటికే రిలీజ్ కాగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది.
ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. నాగబాబు, శేఖర్ మాస్టర్ ఈ షోలకు జడ్జీలుగా వ్యవహరిస్తుండగా ఈ షోలు మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. మరో ప్రోమోలో అనుపమ బృందావనం నుండి కృష్ణుడు వచ్చాడే పాటకు అద్భుతంగా స్టెప్పులు వేశారు. ప్రోమోలో అనుపమ డూప్ అంటూ చేసిన స్కిట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
కొత్తకొత్త కమెడియన్లు ఎంట్రీ ఇస్తుండటంతో కామెడీ స్టార్స్ షో క్రమంగా పుంజుకుంటూ ఉండటం గమనార్హం. రాబోయే రోజుల్లో ఈ షో మరింత మెరుగైన రేటింగ్స్ ను సాధిస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ షోలో ఇతర షోలతో పోల్చి చూస్తే మరింత ఎక్కువగా పేమెంట్స్ ఇస్తుండటంతో ఎక్కువమంది ఈ షోపై ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.