https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. ఒక్క మెసేజ్‌తో ఉద్యోగాలు తెలుసుకునే ఛాన్స్..?

నిరుద్యోగులకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. లాక్ డౌన్ తరువాత నిరుద్యోగం పెరిగిన నేపథ్యంలో ఒక్క మెసేజ్ ద్వారా రాష్ట్ర ఉద్యోగాలను తెలుసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. 72086 35370 మొబైల్ నంబర్ కు వాట్సాప్ ఖాతా ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టి ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. మెసేజ్ పెట్టిన తరువాత వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. భారతీయ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 12, 2021 4:20 pm
    Follow us on

    నిరుద్యోగులకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. లాక్ డౌన్ తరువాత నిరుద్యోగం పెరిగిన నేపథ్యంలో ఒక్క మెసేజ్ ద్వారా రాష్ట్ర ఉద్యోగాలను తెలుసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. 72086 35370 మొబైల్ నంబర్ కు వాట్సాప్ ఖాతా ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టి ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. మెసేజ్ పెట్టిన తరువాత వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. భారతీయ పశుపాలన్‌ లో ఉద్యోగాలు..?

    ఆ తరువాత విద్యార్హతల ఆధారంగా మన నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు, ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వాట్సాప్ చాట్ బోట్ ను ఆవిష్కరించి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేసింది. డీఎస్‌టీకి చెందిన టెక్నాలజీ ఇన్‌ఫర్మేషన్‌ ఫోర్‌క్యాస్టింగ్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ కౌన్సిల్‌ శ్రామిక్‌ శక్తి మంచ్‌ పోర్టల్‌ను రూపొందించి ఈ పోర్టల్ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లోని కార్మికులతో వాట్సాప్ ద్వారా అనుసంధానం అవుతోంది.

    Also Read: ఐడీబీఐ బ్యాంక్ శుభవార్త.. భారీ వేతనంతో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు..?

    72086 35370 మొబైల్ నంబర్ ద్వారా ఏయే రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగులు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగ వివరాలను తెలుసుకోవచ్చు. మోదీ సర్కార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా శ్రామిక్ శక్తి మంచ్ కొత్త పోర్టల్ ను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. నిరుద్యోగులు సొంత రాష్ట్రాల్లోనే ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయో తెలుసుకోవడం వల్ల అటు కంపెనీలకు, ఇటు నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటైన నిరుద్యోగంకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా భవిష్యత్తులో ఇతర భాషల్లో కూడా ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.