అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ విజయభేరి మోగించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగుతోంది. ఇండియాలో మాత్రం కమలహారిస్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అమెరికాలో ఇండియన్లు పాగా వేసి ఎన్నో సంవత్సరాలవుతోంది. అయితే 2016 నుంచి అమెరికా ప్రభుత్వంలో ఇండియన్ల పాత్ర పెరిగింది. ఇప్పటికే ఎంతో మంది సెనెటర్ స్థాయిలో పదవులను పొందారు. కానీ ఉపాధ్యక్ష పదవికి ఒక భారత్‌కు చెందిన వ్యక్తిగా.. మహిళగా కమలహారిస్ గెలువడం భారతీయులను ఉప్పొంగేలా చేస్తోంది. తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి వ్యక్తిగా కమలా నిలిచారు. కమలాహారిస్ విజయంతో ఆమె తల్లి పుట్టిల్లైన తమిళనాడు రాష్ట్రంలోని సంబరాలు మొదలయ్యాయి. ఇంతకీ కమలాహరీస్ ఎవరు..? ఆమె బ్యాక్‌రౌండ్ ఏమిటి..?
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు
తమిళనాడు రాష్ట్రంలోని తిరువరూర్ జిల్లా తులసేంద్రపురం గ్రామానికి చెందిన సివిల్ సర్వెంట్ పి.వి. గోపాలన్ కుమార్తె శ్యామలా గోపాలన్ హారిస్. ఈమె ఢిల్లీలోని లేడి ఇర్విన్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం పై చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. బెర్కిలీలోని కాలిఫోర్నియా వర్సిటీలో చేరారు. నాలుగేళ్ల తరువాత 1962లో వర్సిటీలోని నల్లజాతి విద్యార్థుల సమావేశంలో శ్యామలా ప్రసంగంపై అందరూ ప్రసంశించారు. వారిలో డోనాల్డ్ జె.హ్యారిస్ బాగా మెచ్చుకున్నారు. దీంతో హ్యారిస్, శ్యామలా మధ్య ప్రేమ చిగురించడంలో పెళ్లి చేసుకున్నారు. వారికి కమలాహ్యారిస్ జన్మించింది.
Also Read: జోబైడెన్‌తో భారత్ లాభమా..? నష్టమా..?
శ్యామలా హారిస్ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే చదువును కొనసాగించడంతో క్యాన్సర్ శాస్త్రవేత్తగా ఎదిగారు. డోనాల్డ్ జె.హ్యారిస్ సైతం స్టాన్‌ఫర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. అయితే 1970లో శ్యామల, హ్యారిస్‌లు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత శ్యామల తన ఇద్దరు కూతుళ్లు కమలా హ్యారిస్, మాయ హ్యారిస్‌లను చదివిస్తూ ఉన్నత స్థానాలకు తీసుకెళ్లింది. ఇదే తరుణంలో 2009తో శ్యామల పెద్దపేగు క్యాన్సర్‌తో మరణించారు. ఆ తరువాత కమలా హారిస్ న్యాయవిద్యను పూర్తి చేసి డగ్లస్ ఎమ్హాఫ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
న్యాయవిద్యను పూర్తి చేసిన కమలాహ్యారిస్ బార్ అసోసియేషన్‌లో చేరారు. అలమెడా కౌంటీలో డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా నియమితులయ్యారు. 1998లో శాన్‌ఫ్రాన్సిస్కో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నిగా, 2004 నుంచి 2011 వరకు శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా వ్యవహరించారు. 2016లో కాలిఫోర్నియాలో జరిగిన సెనెట్ ప్రాథమిక ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేసి సెనెటర్‌గా ఎన్నికయ్యారు.
Also Read: ట్రంప్‌పై ఎందుకీ వ్యతిరేకత..? ఆయన ఓటమికి కారణాలేంటి?
2020 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కమలాహ్యారిస్ అంతకుముందు నుంచే చెప్పుకొచ్చారు. అయితే పలు కారణాల వల్ల ఆమె పోల్ నంబర్స్ బాగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రచార నిధులు లేనందున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకొంటున్నట్లు 2019 డిసెంబర్‌లో ప్రకటించారు. అయితే అప్పటికే అధ్యక్ష అభ్యర్థిత్వానికి బరిలో ఉన్న బైడెన్ కమలా హారిస్ తెగువ, పోరాటాన్ని మెచ్చి ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకొన్నారు. ఎన్నికల్లో గెలుపుతో ఇప్పుడు అమెరికాకు భారత బిడ్డ ఉపాధ్యక్షురాలు అయ్యారు.