https://oktelugu.com/

భారీ జాబ్ మేళా: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్.డీసీ) ఈరోజు మరో భారీ జాబ్ మేళాను నిర్వహిస్తోంది. దాదాపు ఐదు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ మేళాను నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళాలో అమెజాన్, శ్రీరాం సిటీ, హెటిరో డ్రగ్స్, ఏరువాక టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 9న ఉదయం 10 […]

Written By:
  • NARESH
  • , Updated On : August 9, 2021 / 09:58 AM IST
    Follow us on

    ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్.డీసీ) ఈరోజు మరో భారీ జాబ్ మేళాను నిర్వహిస్తోంది. దాదాపు ఐదు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ మేళాను నిర్వహిస్తోంది.

    ఈ జాబ్ మేళాలో అమెజాన్, శ్రీరాం సిటీ, హెటిరో డ్రగ్స్, ఏరువాక టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు.

    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 9న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

    ఏరువాక టెక్నాలజీస్ లో డిప్లొమా/ బీటెక్, ఎలక్ట్రానిక్స్/మెకానికల్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.15వేల వరకు వేతనాలు చెల్లించనున్నారు. అభ్యర్థుల వయసు 19-27 ఏళ్లు ఉండాలి.

    అమెజాన్ సంస్థలో సంస్థలో 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డెలివరీ బాయ్స్ విభాగంలో ఈ ఖాళీలున్నాయి. పదోతరగతి చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ.10వేల జీతంతోపాటు అలవెన్సులు ఇస్తారు.

    శ్రీరాం సిటీలో 50 ఖాళీలున్నాయి. డిగ్రీ అర్హత. 13500 వేతనంతోపాటు టీఏ, డీఏ ఇస్తారు. 19-30 ఏళ్లలోపువారు అర్హులు.