https://oktelugu.com/

ఏపీలోని ఆ జిల్లాలో వింత గ్రామం.. ఇంటిముందే సమాధులు..?

మనలో చాలామంది స్మశానం పేరు వింటే తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఊరికి దూరంగా స్మశానం ఉంటే మంచిదని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఏపీలోని ఒక గ్రామంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది. ఏపీలోని కర్నూలు జిల్లాలో ఊర్లోని ఇళ్ల ముందే సమాధులు కనిపిస్తాయి. కర్నూలు జిల్లాలోని గోనెగొండ్ల మండలం అయ్యకొండ గ్రామంలో దశాబ్దాల నుంచి గ్రామస్థులు స్మశానాల మధ్యే జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామంలోని కొండపై ఏకంగా 100 కుటుంబాలు జీవనం సాగిస్తాయి. ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 9, 2021 / 09:51 AM IST
    Follow us on


    మనలో చాలామంది స్మశానం పేరు వింటే తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఊరికి దూరంగా స్మశానం ఉంటే మంచిదని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఏపీలోని ఒక గ్రామంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది. ఏపీలోని కర్నూలు జిల్లాలో ఊర్లోని ఇళ్ల ముందే సమాధులు కనిపిస్తాయి. కర్నూలు జిల్లాలోని గోనెగొండ్ల మండలం అయ్యకొండ గ్రామంలో దశాబ్దాల నుంచి గ్రామస్థులు స్మశానాల మధ్యే జీవనం సాగిస్తున్నారు.

    ఈ గ్రామంలోని కొండపై ఏకంగా 100 కుటుంబాలు జీవనం సాగిస్తాయి. ఈ గ్రామంలో ఒక వింత ఆచారం కూడా ఉంది. ఎవరైనా ఫ్యామిలీలో చనిపోతే ఇళ్ల ముంగిటే వారిని సమాధి చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆ గ్రామంలోని ప్రతి ఇంటిముందు కేవలం సమాధులు మాత్రమే దర్శనమిస్తాయి. ఆ గ్రామంలో నివశించే వాళ్లంతా ఒకే వంశానికి చెందిన వాళ్లు కాగా చరిత్ర ప్రకారం ఆ గ్రామంలో చింతల మునిస్వామి అనే యోగి ఉండేవారు.

    ఒక భూస్వామికి చెందిన ఆవు మునిస్వామికి ప్రతిరోజు పితకకుండానే పాలు ఇవ్వడంతో ఆ విషయం తెలిసిన పశువుల కాపరి ఎల్లప్ప ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత ఎల్లప్ప మునిస్వామి దగ్గరే అధ్యాత్మిక సేవలో ఉండటంతో పాటు తన కొడుకుకు సైతం బాల మునిస్వామి అని పేరు పెట్టుకున్నారు. ఎల్లప్ప మృతి చెందగా అతని దేహాన్ని బాల మునిస్వామి ఇంటిముందే సమాధి చేశారు.

    ఆ తర్వాత గ్రామంలోని ప్రజలు సైతం ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించడం ప్రారంభించారు. ఈ గ్రామంలోని ఏ ఇంట్లో కూడా మంచం కనిపించదు. బడేసాహేబ్ మునిస్వామి తాతకు మంచం వాడవద్దని శాపం పెట్టడంతో గ్రామస్తులు సైతం మంచాలు వాడబోమని చెబుతున్నారు.