India And Russia: పాకిస్తాన్ ఇటీవల రకరకాల ఆయుధాలతో మన దేశం మీద దాడి చేసింది. ముఖ్యంగా బార్డర్ ఏరియాలలో రక్తపుటేరులు పారించడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు మన అమ్ముల పొదిలో ఉన్న ఎస్ -400 ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది. మన గగనతల వ్యవస్థను అత్యంత పకడ్బందీగా కాపాడుకుంది.. దీంతో పాకిస్తాన్ పాచికలు పారలేదు. ఫలితంగా భారత్ పెద్దగా నష్టపోలేదు. అయితే ఎస్ 400 మన గగనతల వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా రక్షించింది. అంతే కాదు మన దేశ సైనిక సామర్థ్యాన్ని.. గగనతల రక్షణ వ్యవస్థను ప్రపంచ దేశాలకు లైవ్ లో చూపించింది. ఎస్ 400 కు ఇతర సమర్థవంతమైన వ్యవస్థలు వంటివి తోడు కావడంతో భారత్ యుద్ధంలో అప్పర్ హ్యాండ్ సాధించింది. ఏమాత్రం ఉగ్రవాద దేశానికి అవకాశం ఇవ్వకుండా ఆకాశం అంచున నిలిచింది. ఏకంగా ఉగ్రవాద దేశంలోని కిరానా హిల్స్ లో న్యూక్లియర్ వాటర్ హెడ్ కు బీటలు వారి.. లీకులు వస్తున్నాయి అంటే.. మన మిసైల్స్ చేసిన దాడులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
Also Read:న్యూక్లియర్ ట్యాంకులు, భారీ సొరంగాలు.. పాక్ కిరానా హిల్స్ లో ఇంకా ఏం చేస్తోందంటే?
ఇప్పుడు బంపర్ ఆఫర్
ఎస్ 400 ద్వారా మన గగనతల వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రపంచానికి గొప్పగా చాటిన భారత్ కు.. మరో గొప్ప అవకాశం లభించింది.. ఉగ్రవాద దేశం నుంచి వచ్చిన డ్రోన్లను.. యుద్ధ విమానాలను ఎస్400 సమర్ధవంతంగా అడ్డుకున్నది. అయితే ఎస్ 400 వ్యవస్థకు అప్డేట్ వెర్షన్ ఎస్ 500 ను మన దేశానికి ఇవ్వడానికి రష్యా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తయారీ ప్రక్రియ కూడా మనదేశంలోనే చేపడతామని రష్యా భారత్ ముందు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రక్షణ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. ” భారత్ వద్ద ఎస్400 ఉంది.. అయితే దీనికి అప్డేట్ వెర్షన్ ఎస్ 500 అందుబాటులోకి వచ్చింది. చుట్టూ శత్రు దేశాలు ఉన్న నేపథ్యంలో భారతదేశానికి పటిష్టమైన రక్షణ చాలా అవసరం. ఇలాంటి సమయంలో రష్యా ముందుకు రావడం గొప్ప విషయం. రష్యా మనకు ఎప్పుడూ శత్రువు కాదు. మన క్షేమాన్ని కాంక్షించే మిత్రుడు.. అందువల్లే రష్యాతో ఈ డీల్ కు భారత్ గనుక ఒప్పుకుంటే ఇక తిరుగు ఉండదు. అన్నట్టు ఈ ఎస్ 500 తయారీ కూడా మనదేశంలో చేపట్టాలని రష్యా భావిస్తూ ఉండడం మనకు అత్యంత అనుకూలమైన విషయమని” రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్ 500 కు మిగతా వ్యవస్థ కూడా తోడైతే భారత్ అగ్రగామిగా ఉంటుందని.. అప్పుడు భారత్ అత్యంత శక్తివంతంగా ఉంటుందని.
జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు వినిపిస్తున్నాయి.