Jeevitha Rajshekar: ఉద్యమానికి ముందు కేసీఆర్ ఆస్తులెన్ని? కేటీఆర్ వాటాల కథేంటి? కవిత లిక్కర్ స్కాంపై బాంబు పేల్చిన జీవిత రాజశేఖర్

Jeevitha Rajshekar: అధికార టీఆర్ఎస్ తో నువ్వానేనా? అన్నట్టుగా బీజేపీ ఫైట్ మొదలైంది. టీఆర్ఎస్ పై వరుస విమర్శలతో బీజేపీ దండు రెడీ అయ్యింది. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబమే టార్గెట్ గా బీజేపీ నేతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ కూతురు కవితను టార్గెట్ చేసిన బీజేపీ.. ఆ రచ్చ చల్లారకముందే ఇప్పుడు కేసీఆర్ , కేటీఆర్ పై పడింది. ఈ ఆరోపణల దాడిలోకి తాజాగా ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు జీవితా రాజశేఖర్ వచ్చి చేరారు. సాధారణంగా […]

Written By: NARESH, Updated On : August 24, 2022 6:16 pm
Follow us on

Jeevitha Rajshekar: అధికార టీఆర్ఎస్ తో నువ్వానేనా? అన్నట్టుగా బీజేపీ ఫైట్ మొదలైంది. టీఆర్ఎస్ పై వరుస విమర్శలతో బీజేపీ దండు రెడీ అయ్యింది. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబమే టార్గెట్ గా బీజేపీ నేతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ కూతురు కవితను టార్గెట్ చేసిన బీజేపీ.. ఆ రచ్చ చల్లారకముందే ఇప్పుడు కేసీఆర్ , కేటీఆర్ పై పడింది. ఈ ఆరోపణల దాడిలోకి తాజాగా ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు జీవితా రాజశేఖర్ వచ్చి చేరారు.

సాధారణంగా సినిమాల్లో ఉండే తారలు రాజకీయాల్లోకి వచ్చినా తమ అవసరార్థం ఎలాంటి కామెంట్స్ చేయరు. కానీ జీవిత మాత్రం బీజేపీలో బీజేపీ వాదిగానే ఉన్నానని తాజా ఆరోపణలతో నిరూపించారు. ఏకంగా సీఎం కేసీఆర్ పై, మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కవిత లిక్కర్ స్కాంను కూడా బయటకు లాగారు. జీవిత కామెంట్స్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై ప్రముఖ నటి జీవితా రాజశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎంతని? ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. క్లబ్, పబ్ లు అన్నింటిలో కేటీఆర్ కు వాటా ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని చాలా మంది యజమానులు తనతో చెప్పినట్లు జీవిత సంచలన ఆరోపణలు చేశారు.లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత తప్పు చేయనప్పుడు నిజమేమిటో ధైర్యంగా చెప్పాలని జీవిత రాజశేఖర్ డిమాండ్ చేశారు.

ఇప్పటివరకూ బండి సంజయ్ సహా ఒకరిద్దరు మాత్రమే కేసీఆర్, కేటీఆర్ ను టార్గెట్ చేసేవారు. కానీ పదునైన విమర్శలు చేయడం చాలా తక్కువ. సినీ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ అయిన జీవిత రాజశేఖర్ ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. నిజంగానే టీఆర్ఎస్ కు ఈ పరిణామం పెద్ద దెబ్బగానే పరిగణించవచ్చు.

ఎందుకంటే ఇప్పటివరకూ గొంతెత్తని నోళ్లు కూడా ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ పై లేస్తున్నాయంటే అది బీజేపీకి శుభపరిణామమే. బలంగా టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే ఇలాంటి గొంతులు మరిన్ని లేవాల్సిన అవసరం ఉంది. అప్పుడే అధికార టీఆర్ఎస్ ను బీజేపీ ధీటుగా ఎదుర్కోగలదు.