Surekha Vani: అవి బాగా ఉన్న బాయ్ ఫ్రెండ్ కావాలి.. లేటు వయసులో సురేఖా వాణి ఘాటు కోరిక !

Surekha Vani: నలభై ఏళ్ల వయసులో ఎంతో అందంగా ఉన్నావ్ అంటూ మగాళ్లు నుంచి తనకు విచ్చలవిడిగా కాంప్లిమెంట్స్ వస్తున్నాయని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి ‘సురేఖావాణి’ సిగ్గు పడుతూ చెప్పుకొచ్చింది. అప్పుడు ఆమె సిగ్గు చూసిన వారంతా.. ఆంటీ రెండో పెళ్ళికి రెడీ అయిందంటూ కామెంట్స్ పెట్టారు. అప్పటి నుంచి ‘సురేఖావాణి’ పెళ్లి పై రోజుకో పుకారు వస్తూనే ఉంది. వాటిల్లో ఏది నిజం ? ఏది అబద్దం ? అని తేల్చుకోలేక […]

Written By: Shiva, Updated On : August 24, 2022 5:22 pm
Follow us on

Surekha Vani: నలభై ఏళ్ల వయసులో ఎంతో అందంగా ఉన్నావ్ అంటూ మగాళ్లు నుంచి తనకు విచ్చలవిడిగా కాంప్లిమెంట్స్ వస్తున్నాయని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి ‘సురేఖావాణి’ సిగ్గు పడుతూ చెప్పుకొచ్చింది. అప్పుడు ఆమె సిగ్గు చూసిన వారంతా.. ఆంటీ రెండో పెళ్ళికి రెడీ అయిందంటూ కామెంట్స్ పెట్టారు. అప్పటి నుంచి ‘సురేఖావాణి’ పెళ్లి పై రోజుకో పుకారు వస్తూనే ఉంది. వాటిల్లో ఏది నిజం ? ఏది అబద్దం ? అని తేల్చుకోలేక నెటిజన్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

Surekha Vani

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇంకా పెళ్లి కాకుండా మిగిలిపోయిన కొందరు ‘సురేఖావాణి’ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ తెగ ప్రపోజల్ పెడుతున్నారట. ఈ లిస్ట్ లో చాలా మంది మగవాళ్ళు ఉన్నారట. మొత్తానికి సురేఖా వాణికి ఉన్న డిమాండ్ ను చూస్తుంటే.. త్వరలోనే ఆమె రెండో పెళ్లికి స్క్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉంది. సురేఖా వాణి తన రెండో భర్త గురించి ఆ మధ్య పక్కా క్లారిటీ ఇచ్చింది. తానూ రెండో పెళ్లి చేసుకుంటే గనుక, తనకు కాబోయే వాడు బాగా డబ్బున్న వాడు అయి ఉండాలి అంటూ ఎలాంటి మొహమాటం లేకుండా కుండ బద్దలు కొడుతూ తానూ ఏమి కోరుకుంటుందో స్పష్టంగా తెలియజేసింది.

Also Read: Cheteshwar Pujara: గేర్ మార్చి, రయ్యిన దూసుకెళ్తున్న పుజారా

తాజాగా మళ్లీ అదే విషయాన్ని లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా చెప్పుకొచ్చింది. సురేఖ వాణి మాట్లాడుతూ ..”నాకైతే రెండో పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు. కానీ భవిష్యత్తులో రావొచ్చు. ఇప్పుడే చెప్పలేను. కానీ, నాకు భర్త కన్నా బాయ్ ఫ్రెండ్ ఏ కావాలి. పెళ్లి కంటే కూడా మంచి బాయ్ ఫ్రెండ్ ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇదే నేను నమ్ముతున్నాను. ఇక నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉండాలి అంటే.. కచ్చితంగా కొన్ని లక్షణాలు.. ఉండాలి. చాలా హైట్ గా ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి, మంచి మనసు ఉండాలి, కొంచెం గడ్డం ఉండాలి, బాగా డబ్బులు సంపాదించుకొని ఉండాలి. నేను ఏం అడిగినా కాదనకుండా కొన్ని ఇచ్చే కెపాసిటీ ఉండాలి.. నన్ను హ్యాపీగా చూసుకోవాలి” అంటూ సురేఖ వాణి చెప్పుకొచ్చింది.

Surekha Vani

దీంతో ఈ వయసులో మీకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఏంటి మేడమ్ అంటూ నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి ఎలాగూ సురేఖా వాణి కూతురు సుప్రీత తన తల్లికి ఎలాగైనా రెండో పెళ్లి చేయాలని తెగ ట్రై చేస్తుందట. మరి అలాంటి బాయ్ ఫ్రెండ్ ను చూస్తొందేమో చూడాలి.

Also Read:Bimbisara Director Vasishta: బింబిసార డైరెక్టర్ వ‌శిష్ట కి కళ్యాణ్ రామ్ ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Tags