అనుష్క బాటలో పూజా హెగ్డే

ఇపుడు తెలుగు చిత్రాల ట్రెండ్ మారింది. పెద్ద, చిన్న అన్న తేడా లేదు. సినిమా బాగుంటే ఎవరు హీరో, ఎవరు హీరోయిన్ అన్న పట్టింపు లేకుండా ప్రేక్షకులు సినిమాల్ని ఆదరిస్తున్నారు. ఆ క్రమంలో హీరోయిన్ లు గ్లామరస్ పాత్రలతో పాటు , తమలోని నటిని సంతృప్తి పరిచే పాత్రల్లో కనిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గత కొంత కాలం గా అనుష్క, నయనతార, సమంత, కీర్తి సురేష్ వంటి అగ్రతారలు కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఓటు వేస్తున్నారు. […]

Written By: admin, Updated On : March 16, 2020 4:45 pm
Follow us on

ఇపుడు తెలుగు చిత్రాల ట్రెండ్ మారింది. పెద్ద, చిన్న అన్న తేడా లేదు. సినిమా బాగుంటే ఎవరు హీరో, ఎవరు హీరోయిన్ అన్న పట్టింపు లేకుండా ప్రేక్షకులు సినిమాల్ని ఆదరిస్తున్నారు. ఆ క్రమంలో హీరోయిన్ లు గ్లామరస్ పాత్రలతో పాటు , తమలోని నటిని సంతృప్తి పరిచే పాత్రల్లో కనిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

గత కొంత కాలం గా అనుష్క, నయనతార, సమంత, కీర్తి సురేష్ వంటి అగ్రతారలు కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఓటు వేస్తున్నారు. కొత్త హీరోయిన్లు ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా వీరి జాబితాలో గ్లామర్ తార పూజా హెగ్డే కూడా చేరబోతుంది. అంటే బుట్ట బొమ్మ ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.

ఇటీవల `అల వైకుంఠపురములో` చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇప్పుడు ప్రభాస్ సరసన ” ఓ డియర్ ” చిత్రంలో నటిస్తోంది. . దీంతోపాటు అఖిల్ హీరోగా చేస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” చిత్రం లో కూడా నటిస్తోంది.. అలాగే త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోయే నూతన చిత్రంలోనూ నటిస్తోంది. ఇదిలా ఉండగా గ్లామరస్ పాత్రలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మకి ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించేందుకు ఆఫర్ వచ్చిందట.

“అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై, పడి పడి లేచే మనసు ” వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు హను రాఘవపూడి ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందించేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ క్రమము లో పూజా హెగ్డే ని సంప్రదించగా.. ప్రాథమికంగా ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇదే నిజమైనట్టయితే తొలిసారి పూజాహెగ్డే ని ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో చూడ బోతున్నాం అన్నమాట… లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కలిసొస్తే ఓకే కానీ.. ఫెయిలైతే మాత్రం ఆ హీరోయిన్ పరిస్థితి గ్లామర్ పాత్రలకు పనికి రాకుండా పోతుంది. దాంతో ఆ హీరోయిన్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారు అవుతుంది.

అందుకే పూజా హెగ్డే ఒకటికి రెండు సార్లు అలోచించి నిర్ణయం తీసుకొంటే బాగుంటుంది అని సన్నిహితులు సూచిస్తున్నారట. .think before while you leap