spot_img
Homeజాతీయ వార్తలుJayalalitha Audio: మరణానికి ముందు డాక్టర్లపై జయలలిత ఆగ్రహం..విదేశాలకు వద్దన్న శశికళ , ఆడియో వీడియో...

Jayalalitha Audio: మరణానికి ముందు డాక్టర్లపై జయలలిత ఆగ్రహం..విదేశాలకు వద్దన్న శశికళ , ఆడియో వీడియో పెనుదుమారం

Jayalalitha Audio: అంత ఆరోగ్యంగా ఉండే తమిళనాడు మాజీ సీఎం జయలలిత సీఎంగా ఉన్న సమయంలోనే సడెన్ గా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జయలలిత మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. జయలలిత ఆస్పత్రిలో పడ్డాక సాధారణ ప్రజలకు ఆమె వీడియోలు, ఆడియోలు, ఫొటోలు చూపించలేదు. లోపల ఏదో జరుగుతున్నట్టు కలరింగ్ ఇచ్చారు. వైద్యులు ఏం చెప్పలేదు. ఇప్పటికీ జయలలిత మరణం తాలూకా మిస్టరీ వీడలేదు.

జయలలిత అనుమానాస్పద మృతి వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతుండగా తాజాగా ఆర్ముగం కమిషన్ రిపోర్ట్ తో మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఆపోలో ఆస్పత్రిలో జయలలితకు సరైన చికిత్స అందలేదనే విషయాన్ని అవి నిర్ధారించేలా ఉన్నాయి.

జయలలిత ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న సమయంలో మాట్లాడినట్టుగా చెబుతున్న కొన్ని మాటల ఆడియో క్లిప్ లీక్ కావడం సంచలనమైంది. ‘డాక్టర్లపై జయలలిత ఫైర్ అయ్యారు. తాను పిలిస్తే ఎందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో దగ్గుతూ బాధపడుతుంటే పట్టించుకోరా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఆడియోను అక్కడే ఉన్న సిబ్బంది రికార్డు చేసినట్టు తెలుస్తోంది.

జయలలితకు చికిత్స అందించిన లండన్ డాక్టర్ రిచర్డ్ బేలే ఈ సందర్భంగా శశికళతో మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. జయను విదేశాలకు తీసుకెళ్లడం మంచిదని డాక్టర్ రిచర్డ్ చెబితే.. ‘మధ్యలో జోక్యం చేసుకున్న శశికళ’.. విదేశాలకు పంపడం అవసరమా? అని ప్రశ్నించారు. దీనికి డాక్టర్ మాత్రం విదేశాలకు వెళ్లాల్సిందేనని.. జయలలిత కూడా అంగీకరించారని బేలే చెప్తున్నారు.దీంతో ఈ వీడియో కలకలం రేపుతోంది. జయలలితను శశికళనే కుట్ర పన్ని చంపించిందా? అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

స్వయంగా జయలలితనే తనను ఆస్పత్రిలో పట్టించుకోవడం లేదన్న ఆడియో.. విదేశాలకు పంపకుండా శశికళ నిరాకరించిన ఆడియోలు చూశాక తమిళనాట పెనుదుమారం రేపింది.

జయలలిత మృతిపై మిస్టరీ చేధించేందుకు తమిళనాడు ప్రభుత్వం అర్ముగస్వామి కమిషన్ వేసింది. ఈ కమిషన్ నివేదిక సంచలనం రేపుతోంది. ఈ నివేదికలో భాగంగానే ఆడియో, వీడియోలు ప్రభుత్వానికి కమిషన్ సమర్పించింది. వీటిని కొందరు లీక్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమిళనాడు సీఎంగా ఉండి చికిత్స అందక ఆమె పడిన బాధ చూసి ఇప్పుడు అందరూ అయ్యోపాపం అంటున్నారు. ఇందులో కుట్ర కోణం ఉందని.. వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper
Exit mobile version