https://oktelugu.com/

Bheemla Nayak Pre Release Event: భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లేవారికి ముఖ్య గమనిక.. ఇవి పాటించండి

Bheemla Nayak Pre Release Event: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే టిక్కెట్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుంది. యూసుఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో జరిగే ఈ వేడుకకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 23, 2022 / 02:29 PM IST
    Follow us on

    Bheemla Nayak Pre Release Event: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే టిక్కెట్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

    Pawan Kalyan Bheemla Nayak

    యూసుఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో జరిగే ఈ వేడుకకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. నిజానికి ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ సోమవారమే జరగాల్సి ఉంది. కానీ ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా చిత్ర నిర్మాతలు ఈ వేడుకను బుధవారానికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కొత్త పాసులు జారీ చేశారు.

    Also Read:  దీపికా పదుకొణె పెళ్లి అయ్యాక ఈ ఎక్స్ పోజింగ్ ఏంటి?

    అయితే యూసఫ్‌గూడ ప్రాంతం నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. భీమ్లానాయక్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఉండటం, అందులోనూ పవర్‌స్టార్ మూవీ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అమీర్‌పేట మైత్రీవనం నుంచి యూసుఫ్‌ గూడ వైపు నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేయనున్నారు. ఆయా వాహనాలను సవేరా ఫంక్షన్ హాల్, కృష్ణకాంత్ పార్క్, కళ్యాణ్ నగర్, సత్యసాయి నిగమాగమం, కృష్టానగర్ మీదుగా మళ్లించనున్నారు.

    Bheemla Nayak Release Poster

    అలాగే జూబ్లీహల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్ గూడ వైపు వెళ్లే వాహనాలను శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమాగమం వైపు మళ్లిస్తామని పోలీసులు వెల్లడించారు. దీంతో ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు ఈ ఆంక్షలను గమనించాలని పోలీసులు కోరారు. మరోవైపు ఈ వేడుకకు వచ్చేవారి వాహనాల పార్కింగ్ స్థలాలను కూడా పోలీసులు వెల్లడించారు. ఈ ఈవెంట్‌కు వచ్చే వారు సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడయం, ప్రభుత్వ పాఠశాలలో పార్కింగ్ చేయాలని సూచించారు.

    Also Read: సినీ నటుడు నరేష్ భార్య ఘరానా మోసం!

     

    Recommended Video:

    Tags