https://oktelugu.com/

హైకోర్టులో కేటీఆర్ కు ఊరట

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. మంత్రి కేటీఆర్ అక్రమంగా జన్వాడలో ఫౌంహౌజ్ నిర్మించాడని కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ తన ఫౌంహౌజ్ రహదారి కోసం ఏకంగా చెరువును పూడ్చివేసి అక్రమంగా రోడ్డు నిర్మించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గ్రీన్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించాడు. రేవంత్ ఫిర్యాదు మేరకు గ్రీన్ ట్రీబ్యూనల్(ఎన్జీటీ) మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. తనకు గ్రీన్ ట్రీబ్యూనల్ నోటీసులు […]

Written By: , Updated On : June 10, 2020 / 04:17 PM IST
Follow us on


తెలంగాణ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. మంత్రి కేటీఆర్ అక్రమంగా జన్వాడలో ఫౌంహౌజ్ నిర్మించాడని కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ తన ఫౌంహౌజ్ రహదారి కోసం ఏకంగా చెరువును పూడ్చివేసి అక్రమంగా రోడ్డు నిర్మించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గ్రీన్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించాడు. రేవంత్ ఫిర్యాదు మేరకు గ్రీన్ ట్రీబ్యూనల్(ఎన్జీటీ) మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే.

తనకు గ్రీన్ ట్రీబ్యూనల్ నోటీసులు జారీ చేయడంపై మంత్రి కేటీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తాజాగా ఎన్టీటీ ఉత్తర్వులపై స్టే విధించింది. అయితే మంత్రి కేటీఆర్ కూడా ప్రతిపక్షాల దాడిని అంతే సమర్థవంతంగా తిప్పికొట్టారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులపై టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. దీంతో రాష్ట్రంలో కొన్ని రోజులుగా కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.

రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో గ్రీన్ ట్రీబ్యునల్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కేటీఆర్ తెలిపారు. జన్వాడలోని ఫాంహౌజ్ కు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే గ్రీన్ ట్రీబ్యూనల్ నిజాలను పరిశీలించకుండానే తనకు నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. దీంతో తాను హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. తాజాగా ఎన్జీటీ ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇవ్వడంతో కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కొందరు కక్ష్యపూరితంగానే తనపై కేసులు వేశారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ప్రజల కోసం పని చేయాలని సూచించారు. లేకుంటే ప్రజలు మరోసారి గుణపాఠం చెబుతారన్నారు.