https://oktelugu.com/

నితిన్ సినిమాలో విలన్‌గా సాగరకన్య!

హీరో నితిన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘అ ఆ’ తర్వాత లై, చల్ మోహన్‌ రంగా, శ్రీనివాస కళ్యాణం అంతగా ఆడకపోయినా.. తన స్టయిల్‌కు భిన్నంగా వరుస ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ‘భీష్మ’తో బ్లాక్ బాస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘రంగ్‌దే’ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్. అలాగే, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు. […]

Written By:
  • admin
  • , Updated On : June 10, 2020 / 04:06 PM IST
    Follow us on


    హీరో నితిన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘అ ఆ’ తర్వాత లై, చల్ మోహన్‌ రంగా, శ్రీనివాస కళ్యాణం అంతగా ఆడకపోయినా.. తన స్టయిల్‌కు భిన్నంగా వరుస ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ‘భీష్మ’తో బ్లాక్ బాస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘రంగ్‌దే’ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్. అలాగే, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. వీటితో పాటు బాలీవుడ్‌ సూపర్ హిట్‌ మూవీ ‘అంధాదూన్’కు కూడా కొబ్బరి కాయ కొట్టాడు. మేర్లపాక గాంధీ దీనికి డైరెక్టర్. ఠాగూర్ మధు సమర్పనలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అక్క నిఖితా రెడ్డి నిర్మించనున్నారు.

    ఈ మూవీలో నితిన్‌ అంధుడి పాత్ర పోషించనున్నాడు. కథ ప్రకారం ఇందులో లేడీ విలన్‌ ఉంటుంది. బాలీవుడ్‌లో ఈ పాత్రలో సీనియర్ నటి టబు నటించింది. తెలుగులో ఈ పాత్రకు తగిన లేడీ ఆర్టిస్ట్ కోసం చిత్ర యూనిట్‌ చాన్నాళ్లుగా అన్వేషిస్తూనే ఉంది. తొలుత అనసూయ పేరు వినిపించింది. డిమాండ్‌ ఉన్న నటి కావడం, ఇప్పటికే ‘క్షణం’ సినిమాలో కూడా విలన్‌గా యాక్ట్ చేసి మెప్పించిన నేపథ్యంలో అనసూయ అయితే బాగుటుందని చాలా మంది భావించారు. కానీ, ఆమె నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో రమకృష్ణ కూడా అనుకున్నారు. తాజాగా, ఇప్పుడు సీనియర్ నటి శిల్పా శెట్టి పేరు తెరపైకి వచ్చింది. చిత్ర బృందం ఆమెను సంప్రదించగా.. వెంటనే ఓకే చెప్పేసిందని టాలీవుడ్‌ టాక్‌.

    1996లో వెంకటేశ్ సరసన ‘సాహస వీరుడు సాగరకన్య’ మూవీతో తెలుగు తెరకు పరిచమైన శిల్పా శెట్టి తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచేసింది. సాగరకన్యగా అద్భుతంగా నటించిన శిల్ప.. తెలుగులో చివరగా 2001లో బాలకృష్ణ మూవీ ‘భలేవాడివి బాసు’లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైన బడా వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుంది. తర్వాత నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఈ ఏడాదే హిందీలో రెండు చిత్రాలకు సంతకం చేసింది. అలాంటి శిల్ప.. తెలుగు మూవీలో.. పైగా నెగిటివ్‌ రోల్‌లో నటిస్తే గొప్ప విషయమే. అదే జరిగితే దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనుంది.