Janasena Yuvashakti Meeting: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించే స్థాయిలో నేడు శ్రీకాకుళం లోని రణస్థలం సభ ప్రాంగణం లో ‘యువశక్తి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాడు..ఈ సభలో యువతని నేరుగా వేదిక మీదకు తీసుకొచ్చి, వైసీపీ ప్రభుత్వం వల్ల ఎదురుకుంటున్న కష్టాలను కోట్లాది మంది ప్రజలకు తెలిపే కార్యక్రమం ని చేపట్టాడు..ఈ సభకి రాష్ట్రం నలుమూలల నుండి అభిమానులు లక్షల సంఖ్యలో హాజరయ్యారు.

పవన్ కళ్యాణ్ ఈ సభని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తో జనసేన పార్టీ నాయకులు ఈ సభని విజయవంతం చేసేందుకు అహర్నిశలు కష్టపడ్డారు..మధ్యలో పోలీసులు ఎన్నో ఇక్కట్లకు గురి చేసిన కూడా ఏ మాత్రం వెనకడుగు వెయ్యకుండా వాళ్ళతో పోరాడి జనసేన కార్యకర్తలను సభా ప్రాంగణం కి తరలించారు..అయితే సభ ప్రారంభం అయ్యేముందే ఒక అపశృతి చోటు చేసుకుంది..అది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..పవన్ కళ్యాణ్ అభిమానులపై ప్రశంసల వర్షం కురిపించేలా చేస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే కార్యకర్త కి సభలో గుండె పోటు వచ్చి స్పృహ కోల్పోయి క్రిందపడిపోయాడు..ఇది గమనించిన పవన్ కళ్యాణ్ అభిమానులు వెంటనే అతనికి ‘సీపీయార్’ చేసి ప్రాణాలను కాపాడారు..ఆ తర్వాత వెంటనే అతనిని అంబులెన్సు ఎక్కించి ప్రథమ చికిత్స చేయించారు..దానికి సంబంధించిన వీడియో ని మీరు క్రింద చూడవచ్చు..పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే అల్లరి చేసే వాళ్ళు మాత్రమే కాదు, సహాయం చెయ్యడం లో అందరికంటే ముందు ఉండే ఏకైక ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే అని అందరూ ప్రశంసిస్తున్నారు..మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
యువశక్తి సభ వద్ద జనసేన కార్యకర్తకు గుండె పోటు చేసి ప్రాణాలు కాపాడిన జనసైనికులు | Prime9 News#yuvashakti #PawanKalyan #Janasena #JanaSenaYuvashakti #Prime9News pic.twitter.com/guOyzdhFCw
— Prime9News (@prime9news) January 12, 2023