Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు అండగా చంటి పాపతో వైజాగ్ నోవో టెల్ దగ్గర ఈ మహిళ అసమాన పోరాటం

Pawan Kalyan Vizag Tour: ఈరోజుల్లో కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యుడిలా చూసే వాళ్లు ఎవరుంటారు. వారు మరణిస్తే వచ్చి మరీ రూ.5 లక్షలు చేతిలో పెట్టి భరోసా కల్పించే నేత ఎవరుంటారు? కానీ ఒక్కడున్నాడు.. అతడే జనసేనాని పవన్ కళ్యాన్. తన పార్టీ కోసం పనిచేస్తూ ఆపదలో మరణించిన జనసైనికులకు నేనున్నానంటూ పవన్ ముందుకొచ్చారు. విశాఖపట్నంకు ‘జనవాణి’ కోసం వచ్చిన పవన్ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున విరాళం అందజేసి వారిని కడుపులో పెట్టుకొని […]

Written By: NARESH, Updated On : October 17, 2022 10:01 am
Follow us on

Pawan Kalyan Vizag Tour: ఈరోజుల్లో కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యుడిలా చూసే వాళ్లు ఎవరుంటారు. వారు మరణిస్తే వచ్చి మరీ రూ.5 లక్షలు చేతిలో పెట్టి భరోసా కల్పించే నేత ఎవరుంటారు? కానీ ఒక్కడున్నాడు.. అతడే జనసేనాని పవన్ కళ్యాన్. తన పార్టీ కోసం పనిచేస్తూ ఆపదలో మరణించిన జనసైనికులకు నేనున్నానంటూ పవన్ ముందుకొచ్చారు. విశాఖపట్నంకు ‘జనవాణి’ కోసం వచ్చిన పవన్ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున విరాళం అందజేసి వారిని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు.

మరణిస్తే అయినవారే ఆ కుటుంబాన్ని వీధి పాలు చేస్తున్న ఈరోజుల్లో కుటుంబానికి రూ.5లక్షలు అందించి పవన్ చేసిన సాయాన్ని ఏ జనసైనికుడు మరిచిపోవడం లేదు. అందుకే ఆయనంటే జనసేన నేతలు, అభిమానులకు అంత ప్రాణం.

తాజాగా ఒక వీరమహిళ పవన్ కళ్యాణ్ కోసం ఆయన బస చేసిన విశాఖలోని నోవాటెల్ హోటల్ ముందర సముద్రం ఒడ్డున చంటి బిడ్డతో పోరాటం చేసింది. రాత్రి 11 గంటలు అయినా కూడా చంటిబిడ్డతో కలిసి జనసేన జెండా పట్టుకొని పోరుసల్పింది. ఇంత రాత్రి పూట కనీసం తిండి కూడా తినకుండా పోరాడుతోంది. ఆమె డిమాండ్ ఏంటని మీడియా ప్రశ్నించగా ఆమె అభిలాషను బయటపెట్టింది..

‘మా జనసేన కార్యకర్తలను చాలా ఇబ్బంది పెట్టారు. ఏం లేకున్నా పోలీసులు కొట్టారు. జైల్లో పెట్టారు. వారిని విడుదల చేయాలి. మేం నిన్నటి నుంచి జనసేన జెండా పట్టుకొని ఇక్కడ పోరాడుతున్నాం.. పవన్ ఎక్కడికి వెళితే అక్కడ నుంచి పోరాడుతాం.. పవన్ సీఎం కావడమే తమ లక్ష్యం.. మా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన వారందరి కోసం మా ఈ పోరాటం. ఇలా వైసీపీ సర్కార్ రాజకీయం కోసం జనసేన నేతలను వేధించడం కరెక్ట్ కాదు.’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రాత్రి వరకూ ఇలా జెండా పట్టుకొని పవన్ కళ్యాణ్ కోసం ఎందుకింతలా తపన పడుతున్నారని ఆ మహిళను ప్రశ్నించగా ఆమె ఆసక్తికరంగా స్పందించారు. ‘పవన్ వస్తే రాష్ట్రం బాగుంటుంది. రాజకీయాల్లో ఆయన రావాలి. జగన్ వచ్చి ఏం చేయలేదు. నరకం చూస్తున్నాం.. ఇంకా మూడు రాజధానులు కావాలంటూ అంటున్నాడు. ఒక్క రాజధానికే ఆయన ఏం చేయలేదు. మూడు రాజధానులకు ఏం చేస్తాడు? పవన్ రావాలి.. పవన్ కోసం ఎక్కడికైనా వెళతాం.. సభలు సమావేశాల్లో పాల్గొంటాం. జై జనసేన’ అంటూ ఆమె నినదించారు.

ఈ వీరమహిళ తన కుటుంబం తో వచ్చి జనసేనానికి తోడు ఉండడం చూసి జనసైనికులు సైతం భావోద్వేగంతో పొంగిపోయారు. రాత్రి 11 అయినా ఏ టైం అయిన కానీ ఆమె అక్కడ నిరసన తెలుపడం చూసి.. పవన్ పై.. పార్టీపై ఆమె ప్రేమాభిమానాలకు జనసైనికులు సలాం కొట్టారు. ఏమి అభిమానమమ్మ నీది..మాటలు రావట్లేదు అంటూ జనసైనికులు కొనియాడారు.