Janasena: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంత వేడిగా ఉన్నాయో మనం గమనిస్తూనే ఉన్నాము..ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వైపే తిరుగుతున్నాయి..ఇటీవల కాలం లో ఆయన చేపట్టిన జనసేన రైతు భరోసా కార్యక్రమం కి అప్పూర్వమైన స్పందన రావడం తో ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టడం ప్రారంభం అయ్యింది..చనిపోయిన 3000 మంది రైతు కుటుంబాలకు ఒక లక్ష రూపాయిల చొప్పున పవన్ కళ్యాణ్ ఇస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇది ఇలా ఉండగా రాబొయ్యే 2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ని చీల్చబోము అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అధికార పార్టీ వైసీపీ కి గుబులు పుట్టేలా చేసింది..ప్రస్తుతం రాష్ట్రం లో YCP పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది..కానీ టీడీపీ పార్టీ బాగా బలహీన పడడంతో ఆ పార్టీ కి ప్రస్తుతం ఒంటరి గా ప్రభుత్వాన్ని స్థాపించేంత శక్తి లేదు అనే చెప్పాలి..కానీ తెలుగు దేశం పార్టీ జనసేన తో పొత్తు పెట్టుకుంటే మాత్రం వైసీపీ పార్టీ కి చావు దెబ్బ తప్పదు అని ఇప్పటికే అనేక సర్వే రిపోర్ట్స్ తెలుపుతున్నాయి.

Also Read: Pawan Kalyan- BJP: చంద్రబాబు కంటే జగనే సేఫ్.. పవన్ ను ఒప్పించే పనిలో బీజేపీ అగ్ర నాయకత్వం
ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికలలో కూడా టీడీపీ మరియు జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చెయ్యడం వల్ల రెండు పార్టీలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది..ముఖ్యంగా టీడీపీ పార్టీ అయితే దాదాపుగా 60 సీట్స్ కి పైగానే కేవలం జనసేన పార్టీ పోటీ చెయ్యడం వల్ల పోయాయి..ఇప్పుడు ఈ రెండు పార్టీలు పోటీ చేస్తే వ్యతిరేక వోట్ బ్యాంకు చీలకుండా ఒక్కే కూటమి కి పడుతుంది కాబట్టి వైసీపీ పార్టీ ని చావు దెబ్బ తియ్యొచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..పొత్తు పెట్టుకోవడానికి రెండు పార్టీలు సముఖంగా ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ పొత్తు కుదిరితే ఈ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు నిల్చుంటారు అనే దానిపైనే చర్చ..పవన్ కళ్యాణ్ ఈసారి మేము తగ్గేదే లేదు, ఎలాంటి త్యాగాలు చెయ్యబోము అంటూ ఇప్పటికే పలు మీటింగ్స్ లో బహిరంగంగానే తెలిపాడు..మరోపక్క తెలుగు దేశం పార్టీ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి తమ పార్టీ వాళ్ళు కాకుండా కూటమి లో ఉన్న పార్టీ ఇచ్చే అవకాశం అసలు కనిపించడం లేదు..దీనితో జనసేన పార్టీ ఏ పార్టీ తో పొత్తు పెట్టుకోబోవడం లేదని..ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ ఏడాది అక్టోబర్ 5 వ తారీకు నుండి విజయదశమి పర్వదినంని పురస్కరించుకొని, అమ్మవారి ఆశీసులతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు..పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకి పోతే జనసేన పార్టీ భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ కి అవతరించే అవకాశాలు కూడా ఉన్నాయి..ఇప్పటికే కోస్తాంధ్ర ప్రాంతం లో 2019 ఎన్నికల కంటే పది రేట్లు బలంగా తయారైంది జనసేన పార్టీ..పెద్ద పెద్ద లీడర్స్ లేకపోయినా కూడా లోకల్ ఎలక్షన్స్ లో జనసేన తన సాతాని చాటిందనే చెప్పాలి..మరి ముఖ్యమైన సార్వత్రిక ఎన్నికలలో కూడా జనసేన పార్టీ తన సత్తాని చాటుకుంటుందో లేదో చూడాలి.

Also Read: PK Survey Report On Telangana: పీకే సర్వేతో కేసీఆర్ లో గుబులు మొదలైందా?
[…] Also Read: Janasena: ఒంటరి గానే ఎన్నికల పోరు కి జనసేన..? […]
[…] Also Read: Janasena: ఒంటరి గానే ఎన్నికల పోరు కి జనసేన..? […]