
కొంతమంది వెంట నడిచినంత మాత్రానా.. అభిమానం కాదు.. ఒక్క నాయకుడి జనం పార్టీ బలం కాదు.. రాజకీయాల్లో అహం తలకెక్కితే.. అది త్వరగానే పతనానికి తీసుకెళ్తుంది. అయితే అందుకు కొద్ది సమయం పడుతుందంతే.. బీజేపీకి సపోర్టు చేసిన పెద్ద మనసుతో గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేతలు అపహేళన చేశారు. తమకు మేలు చేశారని భావించకపోగా.. అసలు వపన్ ఒక లీడర్ అన్నట్లు కూడా చూడలేదు. అసలు జనసేనతో పొత్తులేకుండానే గెలిచామని చెప్పుకొచ్చారు. ఆ పార్టీతో స్నేహమే లేదన్నారు.
Also Read: తెలంగాణ బీజేపీకి షాక్.. మళ్లీ మొదటికి వ్యవహారం
అన్ని మాటలు మాట్లాడినా.. ఒక్కరు కూడా ఖండించలేదు. హైకమాండ్ కూడా పట్టించుకోలేదు. దంతో పవన్ కల్యాణ్ సమయం చూసి షాకిచ్చాడు. ఎమ్మెల్సీ పోలీంగ్ జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు స్వల్ప తేడాతో బీజేపీ హైదరాబాద్ ఎమ్మెల్సీ సీటును కోల్పోయింది. దీంతో ఇప్పుడు బీజేపీ నేతలు నాలిక కరుచుకుంటున్నారు. అయితే.. ఇంతటితో వదలిపెట్టాలని వపన్ కల్యాణ్ అనుకోవడం లేదు. జనసేను తెలంగాణలో బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: కేసీఆర్ ను వణికించేలా తీన్మార్ మల్లన్న ఏంచేశాడు?
బీజేపీ పెద్దలు ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చినా.. వెనక్కి తగ్గకుండా.. బీజేపీతో ఎలాంటి పొత్తు లేకుండానే త్వరలో జరగనున్న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. తెలంగాణలోని పవన్ అభిమానులు ఇప్పటికే ఇతర పార్టీలో ఉన్నారు. అందరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి.. జనసేన కార్యక్రమాల్లో యాక్టివ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష సాధన కోసమే జనసేన పోరాటం అనే నినాదంతో తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించాలని పవన్ కల్యాణ్ రూట్ మ్యాపు కూడా సిద్ధం చేసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటు.. సాగర్ ఉప ఎన్నికల్లో జనసేన నిలబడితే.. బజేపీకి ఇబ్బందికంగా ఉంటుంది. జనసేనతో సఖ్యత ఉంటే.. ఆ పార్టీ ఓట్లు నాలుగైదు శాతమైనా… బీజేపీకి పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అవీ చీలిపోతాయి. ఈ ప్రభావం పదిశాతం వరకు కూడా పడుతుంది. ఇప్పుడు బీజేపీ నేతలు పవన్తో రాజీ ప్రయత్నాలు చేసినా.. ఫలితం ఉండదనే చెబుతున్నారు.సాగర్ ఉప ఎన్నికకోసం పవన్ ఓ కమిటీ కూడా నియమించారు. ఆ కమిటీనే అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలతో బీజేపీతో పొత్తు అనే ఆప్షన్ లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అంటే.. తెలంగాణలో బీజేపీకి జనసేన పూర్తిగా దూరం అయినట్లే..