Janasena: జనసేన పార్టీ వ్యూహం మర్చుకుంది. జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ప్రజా సమస్యలపై స్పందిస్తోంది. ప్రజా సమస్యలనే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లి గుర్తింపు పొందాలని భావిస్తోంది. ఇదివరకే దసరా కంటే ముందు రోడ్ల దుస్థితిపై నిర్వహించిన శ్రమదానంతో పార్టీకి మంచి ఊపు వచ్చింది. దీంతో ప్రస్తుతం రాష్ర్టవ్యాప్తంగా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్ని జిల్లాల అధ్యక్షులతో సమావేశం అవుతున్నారు. పార్టీ కార్యక్రమాలను దిశానిర్దేశం చేస్తున్నారు.

అన్ని జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజా సమస్యలనే ప్రభావితం చేస్తూ ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యూహాలు ఖరారు చేస్తున్నారు. పార్టీ ఖ్యాతిని నలుదిశలా వ్యాపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. దీని కోసం పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులను రెడీ చేస్తున్నారు.
రాష్ర్టంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పార్టీల్లో అప్పుడే ఆ సంకేతాలు వస్తున్నాయి. మాటల యుద్ధం పెరుగుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య నెలకొన్న విద్వేషాల నేపథ్యంలో జనసేన పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు పవన్ కల్యాణ్ ప్రణాళిక రచిస్తున్నారు. పార్టీకి ఊపు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ జనంలోకి రానందున ఈసారి ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవలని చూస్తున్నారు.
జనసేన పార్టీ తీసుకున్ని నిర్ణయంతో పార్టీ నేతల్లో ఉత్సాహం పెరుగుతోంది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా బలోపేతం కోసం పాటుపడాల్సిన అవసరాన్ని నేతలు గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ప్రతిష్ట ఇనుమడించే అవకాశం ఏర్పడుతుంది. దీనికి కార్యకర్తలు సమాయత్తం కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిస్తున్నారు. ప్రజాసమస్యలను ముందుకు తెచ్చి వాటి పరిష్కారం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.